Begin typing your search above and press return to search.
తప్పు చేసి అలా దొరికిపోయింది!
By: Tupaki Desk | 25 Dec 2019 1:30 AM GMTఆర్.ఎక్స్ 100 చిత్రంతో బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా పాపులరైంది పాయల్ రాజ్ పుత్. అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసి పెదవి ముద్దులకు రెడీ అవుతోంది అన్న టాక్ తొలి చిత్రంతోనే వచ్చింది. ఇంకేం ఉంది ఆ వెంటనే `ఆర్.డి.ఎక్స్ లవ్` అంటూ మరో డీగ్రేడ్ సినిమాకి కమిట్ చేశారు. అయితే ఆ ఒక్క తప్పు అమ్మడిని ఎటో తీసుకెళ్లింది. ఇటీవలే వెంకీమామ లాంటి ఫ్యామిలీ సినిమాలో నటించినా ఆ చిత్రం తనకు ఏమాత్రం ప్లస్ కావడం లేదు.
అలా ఎందుకు జరుగుతోంది? అంటే.. వెంకీమామలో కాస్తంత పద్ధతిగా సాంప్రదాయ బద్ధంగా కనిపించినా కానీ.. అంతకుముందు ఆర్డీఎక్స్ బాంబ్ లా పేలింది కదా! అంటూ యూత్ లో కాస్త ఐటెమ్ గాళ్ తరహా ఇమేజ్ స్థిరపడిపోయింది. సరిగ్గా ఇదే పాయింట్ పాయల్ ని నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎవరైనా ఆఫర్ ఇవ్వాలనుకున్నా.. తొలి రెండు చిత్రాలతో దక్కిన ఇమేజ్ నే దృష్టిలో పెట్టుకుని తనకు కథలు వినిపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉందట.
అందుకే ఛేజారిన పరిస్థితిని తిరిగి అదుపులోకి తెచ్చేందుకు నానా ప్రయాసలకు గురవుతోందట. ప్రస్తుతం డిస్కో రాజాపైనే ఆశలన్నీ. ఈ చిత్రం తనకు మరో కొత్త గుర్తింపును ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరక్కపోతే మళ్లీ ఇబ్బంది తప్పదు. ఫ్యామిలీ సినిమాలకు సూట్ కాదు.. బోల్డ్ గ్లామర్ డాళ్ పాత్రలకే సరిపోతుంది! అన్న ఇమేజ్ స్థిరపడిపోతే అటుపై కేవలం ఐటెమ్ నంబర్లకే పరిమితం కావాల్సి ఉంటుందన్న భయం వెంటాడుతోందట. ఈ సన్నివేశం నుంచి తనని తాను బయట పడేసేందుకు ఏదైనా మాస్టర్ ప్లాన్ వేయాలని చూస్తోందట.