Begin typing your search above and press return to search.
నా గుండె పగిలింది.. ఎంతో కుంగిపోయా
By: Tupaki Desk | 17 Jun 2020 3:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆర్ఎక్స్ 100 సినిమాతో అడుగుపెట్టి తెలుగు కుర్రకారు మనసులు కొల్లగొట్టిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతో పెద్ద సంచలనమే రేపింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. రీసెంట్ గా వెంకీమామ సినిమా ఆడినా కూడా ఎందుకో క్రేజ్ దక్కలేదు. ఇక వరుసగా డిస్కోరాజా, RDX లవ్ లాంటి సినిమాలు ఇలా వచ్చి ప్లాప్ అయి అలా వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని మ్యాగ్జిమమ్ ట్రై చేస్తుంది పాయల్. అయితే పాయల్ టాలీవుడ్ లోకి రావడానికి ముందు హిందీలో సీరియల్ హీరోయిన్.
అక్కడ మంచి పాపులారిటీ వచ్చాక డైరెక్టర్ అజయ్ భూపతి ఆమెకి ఆర్ఎక్స్ 100లో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. అయితే తను హీరోయిన్ కావడానికి చాలా కష్టపడ్డాను అంటుంది అమ్మడు. తాజాగా పాయల్ కూడా తన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. హీరో సుశాంత్ సింగ్ ఫొటోను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుని సుశాంత్ కు నివాళి అర్పించింది. బాలీవుడ్లో బంధుప్రీతి మాత్రమే రాజ్యమేలుతుందని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయల్ రాజపుత్ తన అభిప్రాయాలు బయట పెట్టింది.
"బాలీవుడ్ ఇండస్ట్రీలో నన్ను కూడా అలాగే దూరం పెట్టారు. పాయల్ నువ్వు దీనికి సరిపోవంటూ నా స్థానంలో వేరే వాళ్లను తీసుకున్నపుడు.. నా గుండె పగిలినంత పనైంది. ఎంతో కుంగిపోయాను. కానీ నేను ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించలేదు. మనం అనారోగ్యంతో ఉన్నపుడు ఇతరుల సాయం తీసుకోవడం లేదా..? ఎప్పుడైనా సరే మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీ మనసు లోపల దాగిన కష్టాలను.. కలిగిన నష్టాలను.. మీలోని బలహీనతలు ఇతరులతో పంచుకోవాలని సూచించింది ముద్దుగుమ్మ. అంతేగాక మీ విలువైన జీవితానికి మధ్యలోనే ముగింపు పలకవద్దని ఈ సందర్భంగా అభిమానులతో పాటు నెటిజన్లను కోరింది పాయల్.