Begin typing your search above and press return to search.
క్వారెంటైన్ లోనూ పాయల్ పాప బిజీ బిజీ
By: Tupaki Desk | 24 April 2020 12:40 PM ISTకరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. సెలబ్రెటీలు ఇంకా ప్రముఖులు కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో కొందరు సెలబ్రెటీలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే కొందరు మాత్రం ఈ సమయంలోను పబ్లిసిటీ కోసం లేదంటే ఏదైనా నేర్చుకునేందుకు కేటాయిస్తున్నారు. సెలబ్రెటీలు ఈమద్య ఏదో ఒక ఛాలెంజ్ తో బిజీ బిజీగా ఉంటున్నారు. ఆ మద్య పిల్లో ఛాలెంజ్ ను చేసిన పాయల్ రాజ్ పూత్ ఆ తర్వాత పేపర్ ను డ్రస్ మాదిరిగా డిజైన్ చేసుకుని దాన్ని ధరించిన విషయం తెల్సిందే. ఈమె పిల్లో ఛాలెంజ్.. పేపర్ డ్రస్ ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కేవలం ఈ పిచ్చి ఛాలెంజ్ లు మాత్రమే కాకుండా పనికి వచ్చే పనిని కూడా ఈ అమ్మడు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బ్యూటీ తనకు తాను యాక్టింగ్ విత్ బ్యూటీ అనుకుంటూ ఉంటుంది. మాస్ ఆడియన్స్ లో తనకు మంచి క్రేజ్ ఉంది కాని తెలుగు రాని కారణంగా టాలీవుడ్ లో రాణించలేక పోతున్నట్లుగా భావిస్తుంది. అందుకే ఈ క్వారెంటైన్ టైంను తెలుగు నేర్చుకునేందుకు కేటాయించాలనే నిర్ణయానికి ఈ అమ్మడు వచ్చిందట.
ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా తెలుగును నేర్చుకునే పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు వస్తే హీరోయిన్ గా టాలీవుడ్ లో దున్నేయవచ్చు అనేది అమ్మడి ఆలోచనగా తెలుస్తోంది. ఈ లాక్ డౌన్ పీరియడ్ అయ్యే లోపు తెలుగు నేర్చుకుని తెలుగు సినిమాల్లో నటించాలని కోరుకుంటుంది. కాని అసలు విషయం ఏంటీ అంటే ఈ లాక్ డౌన్ కారణంగా చాలా వరకు సినిమాల నిర్మాణం తగ్గి పోతాయి. కనుక ఈ అమ్మడికి అసలు ఆఫర్లు వస్తాయా లేదా అనేది అనుమానమే. ఈ క్వారెంటైన్ లో కూడా ఏదో ఒక ఛాలెంజ్ తోనో తెలుగు నేర్చుకుంటూనో ఈ అమ్మడు బిజీగా అయితే ఉంది. మరి లాక్ డౌన్ తర్వాత పరిస్థితి ఏంటీ అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.