Begin typing your search above and press return to search.
పాయల్ కి రెండోసారి కోవిడ్ టెస్ట్.. రిజల్ట్ కోసం వెయిటింగ్!
By: Tupaki Desk | 9 April 2021 6:16 AM GMTకరోనా వైరస్ మహమ్మారీ సినీసెలబ్రిటీల్ని వెంటాడి వేధిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలామంది స్టార్లు పాజిటివ్ అని తేలాక చికిత్సతో కోలుకుంటున్నారు. రకుల్- తమన్నా సహా పలువురు కథానాయికలు కరోనా నుంచి చికిత్స తో కోలుకున్న సంగతి తెలిసిందే.
ఓవైపు మహమ్మారీ వెంటాడుతున్నా షూటింగులు యథావిధిగా చేయాల్సిన సన్నివేశం ఉందని కథానాయికలు చెబుతున్నారు. చిత్రీకరణ ప్రారంభించిన వాటి కోసం తప్పనిసరిగా సెట్స్ కి హాజరు కావాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. అలాంటప్పుడు చిత్రబృందంలో ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు తప్పనిసరి. ఇటీవల శ్రుతిహాసన్ మాట్లాడుతూ .. షూటింగుల కోసం ప్రయాణాలు తప్పలేదు. వైరస్ టెస్టులు జీవితంలో భాగంగా మారాయని అన్నారు. ఇంతకుముందు తమన్నా.. రకుల్ లాంటి భామలు నిరంతరం షూట్ లొకేషన్ లో జాగ్రత్తలు తప్పవని టెస్టులు లైఫ్ లో భాగమయ్యాయని వెల్లడించారు. ఇది కేవలం కొందరి సమస్యే కాదు. ఆర్టిస్టులు సెలబ్రిటీలందరి సన్నివేశం ఇదే. ఆన్ లొకేషన్ తప్పనిసరిగా టెస్టుల్ని నిర్వహిస్తున్నారు. తాజాగా పాయల్ రాజ్ పుత్ తన తదుపరి చిత్రం షూటింగ్ కోసం సన్నాహకాల్లో ఉన్నారు.
తొలిగా తనకు ఆన్ లొకేషన్ కరోనా టెస్టుల్ని చేశారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని పాయల్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. నిజానికి పాయల్ గత ఏడాది ఇదే సమయంలో ఓసారి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు నెగెటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా సెట్స్ కి వెళ్లకముందే మరోసారి టెస్ట్ చేశారు. మరి కాసేపట్లో రిజల్ట్ రావాల్సి ఉందని పాయల్ వెల్లడించారు. అయితే ఇది ర్యాపిడ్ టెస్ట్. వెంటనే స్పాట్ లోనే ఐదు నిమిషాల్లో తనకు రిజల్ట్ కూడా చెప్పేస్తారు. మరి దానిపై పాయల్ అప్ డేట్ చెప్పాల్సి ఉంది.
షూటింగ్ ప్రారంభించే ప్రతి సెలబ్రిటీకి ఈ సన్నివేశం ఎదుర్కోక తప్పదు. కరోనా టెస్టులు అయ్యాకే ఆన్ లొకేషన్ చిత్రీకరణల్ని ప్లాన్ చేస్తున్నారు. మొదటిసారి కరోనా టెస్ట్ చేసినప్పుడు ఏడ్చేశానని పాయల్ అప్పట్లో అన్నారు. అయితే వ్యాధి ఆరంభంలో దానిపై అస్సలు అవగాహన లేదు. ఈసారి చాలా అవగాహన ఉంది. అందుకే ఇలా కూల్ గా తాపీగానే టెస్టులకు సహకరించారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లో నటిస్తున్నానని పాయల్ అన్నారు. దాని వివరాల్ని వెల్లడించాల్సి ఉంది.