Begin typing your search above and press return to search.

క్యాబరే డాన్సర్ గా పాలసముద్రంలాంటి పాయల్!

By:  Tupaki Desk   |   4 Dec 2021 9:40 AM GMT
క్యాబరే డాన్సర్ గా పాలసముద్రంలాంటి పాయల్!
X
పాయల్ ఓ పాలసముద్రం .. ఆ సొగసుల కెరటాలు తెరపై పరుగులు తీస్తూనే ఉంటాయి. కుర్రకారు ఊహలను ఉత్సాహంతో ఉరకలు వేయిస్తూనే ఉంటాయి. పాయల్ కళ్లు మత్తుమందు కూర్చినట్టు .. మందుపాత్రలు పేర్చినట్టుగా ఉంటాయి. అందుకే ఈ అందాల చందమామకు సక్సెస్ లు పెద్దగా లేకపోయినా, అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

కుర్రాళ్లు ఇస్తున్న రేటింగ్ పెరుగుతూనే ఉంది. పాయల్ మంచి పొడగరి .. పున్నమి వెన్నెల్లో పూతరేకులు పేర్చినట్టుగా కనిపించే సౌందర్యం ఆమె సొంతం. పదునైన ఆమె చూపులు శాసనాలు చేస్తాయి .. శ్వాస తీసుకోవడం మరిచిపోయేలా చేస్తాయి.

హీరోయిన్లలో చాలామంది తెరపై కాస్త నిలదొక్కుకునేవరకూ గ్లామర్ నే నమ్ముకుంటారు .. నమ్ముకోవాలి కూడా. ఎందుకంటే హీరోయిన్ గ్లామర్ గా కనిపించాలనే ప్రేక్షకులు కోరుకుంటారు.

ఫైటింగులు గట్రా చేసిన అలసిపోయిన హీరోకి కాస్త ఉపశమనం కలిగించేది .. ఆ ఫైటింగులు చూస్తూ టెన్షన్ పడిన కుర్రాళ్లకి కాస్త ఉపశమనం ఇచ్చే అందాల ఔషధమే హీరోయిన్.

అందువల్లనే హీరోయిన్ లేని సినిమా చందమామ లేని ఆకాశంలా బోసిపోతుంది. అందాల హీరోయిన్ అలా కథలో కనిపించాలంతే. అలాంటి అందాలు పుష్కలంగా యున్న హీరోయిన్ గా పాయల్ కనిపిస్తుంది.

మొదటి సినిమా నుంచే అందాలు ఆరబోయడానికి తనకి ఎలాంటి అభ్యంతరాలు లేవనే సంకేతాలని పాయల్ పంపంచింది. ఆ తరువాత సినిమాల్లోను గ్లామరసాన్నే ఎక్కువగా ఉపయోగిస్తూ వెళ్లింది. సినిమాల్లో తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది.

అక్కడ కూడా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె కన్నడ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతుందనే మాట వినిపిస్తోంది. అక్కడ ఒక సినిమాలో ఆమె క్యాబరే డాన్సర్ గా కనిపించనుంది.,

కన్నడలో ధనుంజయ హీరోగా 'హెడ్ బుష్' సినిమా రూపొందుతోంది. ఒక అండర్ వరల్డ్ డాన్ బయోపిక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పాయల్ క్యాబరే డాన్సర్ గా కీలకమైన పాత్రను పోషిస్తోంది. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

ఈ సినిమాలోని పాత్ర తనకి మంచి పేరు తీసుకుని వస్తుందని ఆమె భావిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే కన్నడలో పాయల్ కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అక్కడ ఈ బ్యూటీ అదృష్టం ఎలా ఉంటుందో ఏమిటో!