Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ టీజింగ్ ఫోజులేంటమ్మా?

By:  Tupaki Desk   |   18 Feb 2020 5:30 PM GMT
ఫోటో స్టోరి: ఈ టీజింగ్ ఫోజులేంటమ్మా?
X
``అందం నీపేరా ఆనందం నీ ఊరా.. నండూరి నాయికివా.. శృంగార దేవతవా.. నిన్ను ప్రేమించానె ఓ మైనా..`` .. `చిరున‌వ్వుతో` మూవీలో క్లాసిక్ చార్ట్ బ‌స్ట‌ర్ లిరిక్ ఇది. ఉదిత్ నారాయ‌ణ్ ఆల‌పించారు. భువ‌న‌చంద్ర క‌లం నుంచి జాలువారిన ఆ ప‌దాలు ఇదిగో ఇంతందాన్ని చూశాకే పుట్టాయేమో!

ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ సాంప్ర‌దాయ లెహంగాలో ఇంత అందంగా క‌వ్వించేస్తోంది. టాప్ టు బాట‌మ్ రెడ్ క‌ల‌ర్ ట్రీట్ అదిరిపోయింది. ఎర్ర రంగు ప‌రికిణీ.. ఎరుపు జాకెట్ ... ఆ న‌డుమును చుట్టుకున్న రెడ్ స్ట్రిప్ వ‌డ్డానం వ‌హ్వా! అనాల్సిందే. నాభి అందాల్ని ఎద సౌంద‌ర్యాన్ని అంతే అందంగా ప్రెజెంట్ చేసింది ఈ డిజైన‌ర్ లెహెంగా డ్రెస్. పాత సినిమాలో సుహాసినిలా ఆ కొంగును అందంగా క‌వ‌రింగ్ ఇస్తూ .. ఇదిగో ఇలా నాలుక‌ను బ‌య‌ట పెట్టి కొంటెగా క‌వ్వించేసింది.

క‌వ్వించే కొంటె కోనంగి యాక్టివిటీతో కుర్ర‌కారును ఖంగు తినిపించేసింది పాయ‌ల్. దేర్ ఈజ్ షేడ్ ఆఫ్ రెడ్ ఫ‌ర్ ఎవ్వెరి ఉమెన్! అంటూ ఈ ఫోటోకి క్యాప్ష‌న్ ఇచ్చింది. మాధ‌వి ఆర్ట్ స్టూడియో అంటూ డిజైన‌ర్ స్టూడియోకి ప్ర‌చారం చేసి పెట్టింది. ఇక ఈ ఫోటో చూడ‌గానే.. హేయ్ హేయ్ మేరి జానేమాన్.. అంటూ ల‌వ్ ఈమోజీల్ని సంధించాడో ప్రేమికుడు. పాయ‌ల్ స్మైల్ కి కితాబిచ్చేశాడు. కొంద‌రు మ‌రీ ఈ టీజింగ్ ఫోజులేంట‌మ్మా? అంటూ ప్ర‌శ్నించారు. అన్న‌ట్టు వెంకీ మామ స‌క్సెస్ హుషారుల్ పాయ‌ల్ ర‌క‌ర‌కాల ప్రాజెక్టుల‌కు క‌మిటైంద‌న్న ప్ర‌చారం సాగింది. అవేంటో అధికారికంగా త‌నే చెబితే బావుంటుందేమో!