Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండే కావాలంటున్న బ్యూటీ...!

By:  Tupaki Desk   |   27 April 2020 1:30 AM GMT
విజయ్ దేవరకొండే కావాలంటున్న బ్యూటీ...!
X
'Rx 100' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ చిత్ర విజయంతో ఎక్కడికో వెళ్ళుపోతుందనుకున్న పాయల్ కు నిరాశే ఎదురైంది. పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు 'RDX 100' లాంటి చిన్న చిన్న చిత్రాలలో నటించే అవకాశం మాత్రమే దక్కింది. 'RDX 100' సినిమాలో 'Rx 100' ని మించి అందాలను ఆరబోసినప్పటికీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రం దక్కించుకోలేకపోయింది. 'వెంకీమామ' సినిమాలో నటించినా సినిమా అయితే హిట్ అయ్యింది.. తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరికి రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాలో నటించినప్పటికీ మళ్ళీ పరాజయం పలకరించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన పాయల్ అందరు సెలబ్రెటీలలాగే సోషల్ మీడియాతో టైమ్ పాస్ చేస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన పాయల్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ 'ఇప్పటికిప్పుడు వెంటనే ఎవరితో నటించాలని కోరుకుంటావ్' అని అడిగాడు. దీనికి పాయల్ వెంటనే విజయ్ దేవరకొండతో ఇమిడియేట్ గా యాక్ట్ చేయాలనుంది అని బదులిచ్చింది. ఇది తెలుసుకున్న మన రౌడీ ఫ్యాన్స్ వీళ్ళ కాంబినేషన్ లో మూవీ సెట్ అయితే బాగుండు అని ఆశపడుతున్నారు. అంతేకాకుండా మరొక నాటీ నెటిజన్ 'నీకు Rx 100 హీరో కార్తికేయతో డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఏమి చేస్తావ్' అని ప్రశ్నించాడు. దీనికి పాయల్ సమాధానం చెప్తూ.. నేను కార్తికేయ చాలా మంచి స్నేహితులం.. తనతో అదే బంధాన్ని కొనసాగిస్తా అని సమాధానం చెప్పింది. పాయల్ రాజ్ ఫుట్ ఆల్రెడీ తన చిన్ననాటి స్నేహితుడు నటుడైన సౌరభ్ ధింగ్రాతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి అన్ని పార్టీలకు హాజరవుతుంటారు కూడా. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు కూడా అంగీకరించారు.