Begin typing your search above and press return to search.

నటికి లభించని బెయిల్‌.. 8 రోజుల రిమాండ్‌

By:  Tupaki Desk   |   16 Dec 2019 12:17 PM GMT
నటికి లభించని బెయిల్‌.. 8 రోజుల రిమాండ్‌
X
బాలీవుడ్‌ నటి పాయల్‌ రోహత్గీ ఇటీవల నెహ్రూ తండ్రి మోతీలాల్‌ నెహ్రూ మరియు గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపాయి. సోషల్‌ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. పోస్ట్‌ చేసిన వీడియోలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రాజస్థాన్‌ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి చార్మేష్‌ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసును స్వీకరించిన పోలీసులు ఇటీవల పాయల్‌ రోహత్గీని అరెస్ట్‌ చేయడం జరిగింది.

పాయల్‌ అరెస్ట్‌ ను తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించింది. గుజరాత్‌ లోని బుండీ కోర్టులో ఈమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ పై విచారణ జరిగింది. కోర్టు పాయల్‌ కు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఆమె అరెస్ట్‌ అవ్వక తప్పలేదు. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు 8 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ కు పంపించడం జరిగింది. అక్టోబర్‌ 10న ఈ కేసు నమోదు అవ్వగా ఇటీవల పాయల్‌ అరెస్ట్‌ అయ్యింది.

కాంగ్రెస్‌ నాయకులు కొందరు ప్రభుత్వంలో ఉన్న వారిపై తనను అరెస్ట్‌ చేసేలా ఒత్తిడి చేశారంటూ ఇటీవల పాయల్‌ రోహత్గీ ఆరోపించింది. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి పాయల్‌ రోహత్గీ వారం రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది.