Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ఒక బి-గ్రేడ్ యాక్టర్: పాయల్ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   31 July 2020 5:05 PM GMT
ఆ హీరోయిన్ ఒక బి-గ్రేడ్ యాక్టర్: పాయల్ సంచలన కామెంట్స్
X
గతనెల ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ సింగ్ రాజపుత్ గురించి బాలీవుడ్ లో ఇప్పటికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సుశాంత్ మృతి పట్ల ఎవరికి వారు అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లోని చాలామంది సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సుశాంత్ గురించి స్పందిస్తున్నారు. అయితే ఇప్పటికి ఇండస్ట్రీలో కొంతమంది సుశాంత్ విషయం పై మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికి ఇండస్ట్రీలో నెపోటిజమ్ పై కూడా అగ్గి రాజుకుంటుంది. అందులోను అందరూ స్పందించగా.. స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఇప్పటి వరకు ఏమి మాట్లాడలేదు. అయితే కత్రినా పై సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ పాయల్ రోహాట్గి. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం మొదలైన ఈ భామ ఖచ్చితంగా వివాదం చెలరేగే కామెంట్స్ చేస్తుంది.

అయితే ఇప్పటివరకు పాయల్ చేసిన సినిమాల కంటే తలదూర్చిన కాంట్రవర్సీలే ఆమెకు ఎక్కువ క్రేజ్ తెచ్చాయట. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉంటున్న పాయల్.. 2008లో బిగ్ బాస్ కంటెస్టెంటుగా పాల్గొన్నది. తాజాగా పాయల్ కత్రినా కైఫ్ పై ఊహించని విధంగా కామెంట్స్ చేసింది. సుశాంత్ మృతిచెందిన రోజే స్పందించిన కత్రినా.. ఆ తర్వాత ఇంతవరకు పెదవి విప్పలేదు. పాయల్ మాట్లాడుతూ.. "కత్రినా ఒక బి-గ్రేడ్ విదేశీ యాక్టర్. సల్మాన్ లాంటి వాళ్లతోనే రొమాన్స్ చేస్తుంది. ఓరోజు సల్మాన్.. మరొక రోజు మరొకరు ఆమె తీరు అర్ధం కావడం లేదు" అనే కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ఇక కత్రినా సమాధానం కూడా ఊహించి పాయల్ చెప్పేస్తుంది. "సుశాంత్ మృతి పై మాట్లాడటానికి నేనేమి బాలీవుడ్ హీరోయిన్ కాదు. అంతేగాక అతనితో ఒక్క సినిమా కూడా చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు స్పందించాలి" అంటూ కత్రినా ఖంగుతినే కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పాయల్ కామెంట్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. మరి కత్రినా ఎలా స్పందిస్తుందా.. అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.