Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రాకి 'ఆర్ ఆర్ ఆర్' క‌నిపించ‌లేదా?

By:  Tupaki Desk   |   9 Jan 2023 12:30 PM GMT
ప్రియాంక చోప్రాకి ఆర్ ఆర్ ఆర్ క‌నిపించ‌లేదా?
X
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా `ఆర్ ఆర్ ఆర్` ని ప‌ట్టించుకోవ‌డం లేదా? టాలీవుడ్ సినిమాని లైట్ తీసుకుందా? రాజ‌మౌళి..చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్ క‌ష్టం పీసీకి క‌నిపించ‌డం లేదా? అంటే అవున‌నే భావించాలేమో. అవును తాజా స‌న్నివేశ‌లు చూస్తుంటే అలాగే క‌నిపిస్తుంది. ఎలాగైనా ఆస్కార్ తో `ఆర్ ఆర్ ఆర్` తిరిగి రావాల‌ని రాజ‌మౌళి లాస్ ఎంజిల్స్ లో తిష్ట వేసి ఎలా శ్ర‌మిస్తున్నారో తెలిసిందే.

అధికారికంగా భార‌త్ నుంచి నామినేట్ కాక‌పోయినా...జ‌న‌ర‌ల్ కేట‌గిరీ విభాగంలో జ‌క్క‌న్న అవార్డు బ‌రిలోకి దించారు. దీనికి క‌ర్త‌..క‌ర్మ‌..క్రియ అన్ని ఆయ‌నే. అందుకోసం కోట్ల రూపాయ‌లు తానొక్క‌డే వ్య‌క్తిగ‌తంగా ఖ‌ర్చు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డుల‌కు ముందు బ‌హుక‌రించే ప‌లు అవార్డుల‌తో ఇప్ప‌టికే ఇండియాని షేక్ చేస్తుందీ చిత్రం.

అయితే ఈ సినిమాని బాలీవుడ్ కం హాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. గుజ‌రారీ చిత్రం `చెల్లో షో` బెస్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ విభాంగంలో పోటీ ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్ప‌టికే అవార్డుల తుది జాబితాలో చోటు ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో సీనినిమా ప్ర‌చార భాద్య‌త‌ల్ని ప్రియాంక చోప్రా నెత్తిన వేసుకుని మోస్తోంది.

కొంతమంది హాలీవుడ్ ప్ర‌ముఖుల కోసం పీసీ స్వ‌యం `చెల్లో షో` స్పెష‌ల్ స్ర్కీనింగ్ నిర్వ‌హించింది. ఈ విష‌యాన్ని నేరుగా ఆమె కాకుండా ఓ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు సోష‌ల్ మీడియాలో రివీల్ చేసారు. ఈ షోకి హాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత‌ల‌తో పాటు మాతృక చిత్ర ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు ..ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. వాళ్ల‌కి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్ల‌ని పీసీనే ద‌గ్గ‌రుండి చూసుకుంది.

కానీ ఇంత చొర‌వ `ఆర్ ఆర్ ఆర్` విష‌యంలో ఎక్క‌డా క‌నిపించేదు. క‌నీసం ఆ సినిమా గురించి పీసీ ఎలాంటి ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైనా చిత్రాన్నే ఆద‌రిస్తారా? తెలుగు సినిమా పీసీ కంటికి క‌నిపించ లేదా? రాజ‌మౌళి ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో ఆమె దృష్టికి వెళ్ల‌లేదా? ఇది న్యాయ‌మేనా అంటూ ప్రియాంక చోప్రాని తీరుని ఉద్దేశించి కొంత మంది నెటి జ‌నులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

త‌న త‌రుపున `ఆర్ ఆర్ ఆర్` ని కూడా నిర్వ‌హించి ఉంటే కొంత బూస్టింగ్ దొరికేద‌ని....త‌న‌కున్న ప‌రిచ‌యాలు కొంత వ‌ర‌కూ అవార్డుకు దొహ‌దం చేసేవని కామెంట్లు ప‌డుతున్నాయి. మొత్తానికి అమెరికాలోనే సొంత దేశం నుంచే `ఆర్ ఆర్ ఆర్` కి శ‌త్రువులున్నార‌ని మ‌రోసారి రుజువ‌వుతోంది. ఇంత‌కుముందు అమెరికాలో స్థిర‌ప‌డిన ఓ బాలీవుడ్ ఉద్దండుడు ప్ర‌శంసించాల్సింది పోయి..సినిమాపై రాళ్లు వేసే ప్ర‌య‌త్నం చేసాడు. దీంతో అత‌ని తీరుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులు క‌న్నెరజేసారు.