Begin typing your search above and press return to search.

10వ క్లాస్ బోయ్ ఫ్రెండ్ తో ఆంటీకి దొరికిపోయిన పీసీ

By:  Tupaki Desk   |   12 Feb 2021 12:05 PM GMT
10వ క్లాస్ బోయ్ ఫ్రెండ్ తో ఆంటీకి దొరికిపోయిన పీసీ
X
గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా ఆత్మ‌క‌థ‌తో రూపొందిన‌ `అన్ ఫినిష్డ్` పుస్త‌కం ప్ర‌కంప‌నాల‌కు తెర తీసింది. ఇప్ప‌టికే ఈ పుస్తకంలో పీసీ త‌న జీవిత ర‌హ‌స్యాల్ని బ‌హిరంగంగా వెల్ల‌డించ‌డంపై అభిమానుల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. తాజాగా మరో టాప్ సీక్రెట్ గురించి చ‌ర్చ హీటెక్కిస్తోంది. ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడే త‌న బోయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ దొరికిపోయాన‌ని నాటి చిలిపి సంఘ‌ట‌న‌ను ప‌బ్లిక్ చేసింది పీసీ.

ఒకసారి తన ప్రియుడిని తన గదిలో దాచిపెట్టింది. త‌న ఆంటీ క‌నిపెట్టి త‌న‌ తల్లికి ఫిర్యాదు చేసిందిట‌.ప్రియాంక చోప్రా తన జ్ఞాపకాలైన అన్ ఫినిష్డ్ ‌లో ముఖ్యమైన వ్యక్తిగత వృత్తిపరమైన ర‌హ‌స్యాల‌నే కాకుండా కొన్ని ఫన్నీ కథలను కూడా వెల్లడించింది. ఈ పుస్తకం మంగళవారం విడుదలైంది. ఇది ప్రియాంక జీవితంలో చాలా సన్నిహిత విష‌యాల్ని బ‌హిర్గ‌త‌ప‌రిచింది.

ఈ పుస్తకంలో ప్రియాంక అమెరికాలో గడిపిన కొన్ని సంవత్సరాల గురించి... తన బంధువులతో కలిసి జీవించడం.. అక్కడ పాఠశాలలో చేరడం గురించి కూడా మాట్లాడింది. ఆమె ఒక అబ్బాయి కి పడిపోయింది. బాబ్ అని పేరు మార్చి ఇప్పుడు రివీల్ చేసింది ఆ ల‌వ్ స్టోరి. తన అత్తతో నాటి ల‌వ్ ఎలా ఇబ్బందుల్లో పడిందో చెప్పింది.

తన అత్త కిరణ్ ‌తో కలిసి ఇండియానా పోలిస్ లో నివసిస్తున్నానని ప‌దో త‌ర‌గ‌తిలో బాబ్ ని కలుసుకున్నాన‌ని తెలిపింది. అతను తన ఫన్నీ చేష్ట‌ల‌తో అత్యంత శృంగార హావభావాలతో త‌న మ‌న‌సును గెలిచాడు. అతను ఆమెకు తన గొలుసును బహుమతిగా ఇచ్చాడు. పాఠశాలలో త‌న‌ చేతులు పట్టుకున్నాడు. దాంతో పీసీ అతనితో ప్రేమలో పడింద‌ట‌. ఆ త‌ర్వాత‌ అతనిని వివాహం చేసుకోవాలని కూడా ప్లాన్ వేసింది.

ఒక రోజు బాబ్ .. నేను మంచం మీద టెలివిజన్ చూస్తూ కూర్చున్నాం. అమాయకంగా చేతులు పట్టుకొని ఉండ‌గా.. అకస్మాత్తుగా కిటికీ వెలుపల కాలిబాటలో మా అత్త మెట్ల పై నుంచి వ‌స్తుండ‌డం చూశాను. నేను భయపడ్డాను. మధ్యాహ్నం 2 గంటలు ... ఆమె రావాల్సిన టైమ్ కాదు అది. బాబ్ ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ళడానికి మార్గం లేదు. దాంతో అత‌డితో నేను నా గదికి పరుగెత్తాను. నా గ‌దిలోనే అత‌డిని దాచేశాను అని ఆమె పుస్తకంలో రాసింది.

నేను ఆమెను కిరాణా దుకాణానికి పంపించే వరకు అక్కడే ఉండండి అని అత‌డికి చెప్పాను. అత్త‌ కిరణ్ ఇంట్లోకి ప్రవేశించి ప్రతి గదిలోకి జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టింది. నేను నా మంచం మీద నా బయాలజీ పుస్తకం చదువుతున్నట్లు నటిస్తూ కూర్చున్నాను. ఆమె నా తలుపు దగ్గరకు వచ్చి `తెరువ్` అని అడిగింది. ఏమి తెరవాలి? అని అడిగాను. `నీ గదిని తెరువు` అని నా అత్త కోపంగా అడిగింది. ఇంత‌ కోపంతో నా అత్తను నేను ఎప్పుడూ చూడలేదు.

నేను గది తలుపు తెరిచాను. అదంతా పెద్ద గజిబిజి. ఒక అబ్బాయి బయటకు వచ్చాడు`` అని ప్రియాంక పుస్త‌కంలో రాసింది.ఆ త‌ర్వాత మా అమ్మ‌ను పిలిచి .. నాకు మీ అమ్మాయి అబద్దం చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను. త‌న‌ గదిలో ఒక అబ్బాయి ఉన్నాడు! అని చెప్పింది. అలా 10వ త‌ర‌గ‌తి బోయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ మ్యాట‌ర్ మొత్తం చెప్పేసింది.