Begin typing your search above and press return to search.
ఆలియా ప్రెగ్నెన్స గురించి పీసీపై చెత్త ప్రశ్న?
By: Tupaki Desk | 2 Nov 2022 5:04 AM GMTదాదాపు మూడు సంవత్సరాల తర్వాత ప్రియాంక చోప్రా భారతదేశంలో అడుగుపెట్టింది. ఈసారి తన పర్యటనకు చాలా ప్రత్యేకత ఉంది. తనతో పాటు ఒక బుల్లి అతిథి కూడా స్వదేశానికి రావడంతో ఇప్పుడు అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే! పీసీ ఇంతకీ తన బేబి గాళ్ తో ఇండియాలో ఎందుకు అడుగుపెట్టినట్టు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
మూడు సంవత్సరాల విరామం తర్వాత బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ ఎట్టకేలకు మంగళవారం భారతదేశానికి తిరిగి వచ్చారు. తెల్లవారుజామున ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న పీసీని మీడియా వెంబడించింది. నిజానికి COVID-19 మహమ్మారి చెలరేగినప్పటి నుండి పీసీ లాస్ ఏంజిల్స్ లో తన భర్తతో కలిసి నివసిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాలలో తన మొదటి భారతదేశ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. పీసీ తన కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్ తో కలిసి ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఇక నుంచి ముంబైలో మాల్టీ మేరీ తన మామ్ తో కలిసి షికార్ చేయబోతోందని అభిమానులు భావిస్తున్నారు.
ఈసారి భారత పర్యటనలో చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న అనేక పనులను పూర్తి చేయాలని పీసీ భావిస్తోంది. ప్రస్తుతం అలియా భట్ -కత్రినా కైఫ్ లతో కలిసి 'జీ లే జరా'లో నటించాల్సి ఉంది. తాజాగా అలియా గర్భం వార్తలపై పీసీ తనదైన శైలిలో స్పందించింది.
విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంక చోప్రా వీడియోలు- ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీటిలో ఒక వీడియోలో ఆలియా భట్ తల్లి కావడంపై ప్రియాంకను తన స్పందన చెప్పాల్సిందిగా మీడియా అడిగింది. ఆ ప్రశ్న విన్న ప్రియాంక తన కారులోకి ప్రవేశించే ముందు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి నిష్కృమించింది తప్ప ఏమీ మాట్లాడలేదు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. అయినా సహనటి గర్భధారణపై తాను ఎందుకు స్పందించాలి? అది సంతోషకరమైన విషయమే కదా.. పీసీ నవ్వులో అది కనిపించిందని ఇప్పుడు అభిమానులు సమర్థిస్తున్నారు.
చాలా కాలం తర్వాత ముంబైలో షికార్ చేయడానికి చాలా ఉత్సాహంగా కనిపించిన ప్రియాంక తన ఇన్ స్టాలో తన పర్యటనకు సంబంధించిన చాలా ఫోటోలను షేర్ చేసింది. ఆమె తన బోర్డింగ్ పాస్ చిత్రాన్ని షేర్ చేయడం ద్వారా భారతదేశ పర్యటన గురించి ముందుగా రివీల్ చేసింది. ఆ తర్వాత తన ఫ్లైట్ నుండి ఇంటికి వెళ్లే మార్గంలో ఫోటోలు వీడియోలు.. తన గది నుండి కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
తాజా సమాచారం మేరకు... ప్రియాంక చోప్రా తన పర్యటనలో దర్శకులు విశాల్ భరద్వాజ్ - సంజయ్ లీలా భన్సాలీని కలవనున్నారు. అంతే కాకుండా.. ఫర్హాన్ అక్తర్ 'జీ లే జరా' పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంతోనే వెండితెరపై పీసీ తిరిగి సందడి చేయనుండడం ఆసక్తికరం.
ఇప్పటికే చేతిలో అనేక హాలీవుడ్ ప్రాజెక్ట్ లు కూడా ఉన్నా దేశీ గాళ్ హిందీ చిత్రాలను విడిచిపెట్టడం లేదు. హాలీవుడ్ లో సామ్ హ్యూఘన్ సరసన 'ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మి' అనే రొమాన్స్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రిచర్డ్ మాడెన్ తో కలిసి నటించిన అమెజాన్ స్టూడియో స్పై సిరీస్ సిటాడెల్ లో కనిపిస్తుంది.
పీసీకి అలాంటి అలవాటు ఉంది బ్యాక్ ఇన్ ది బే- ముంబైకి వచ్చినందుకు సంతోషంగా కనిపిస్తోంది పీసీ. దీని వెనక అసలు కారణం ఉంది. గ్లోబల్ స్టార్ పీసీకి స్ట్రీట్స్ లో చీజీ స్నాక్స్ తినడం.. ముంబై రోడ్లపై అర్థరాత్రి డ్రైవ్ లకు వెళ్లడం...ఒక హాబీ. కాఫీ విత్ కరణ్ చూడటానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ముంబైకి వచ్చిన వెంటనే కోస్టార్ అలియా భట్ గర్భం గురించి వ్యాఖ్యానించమని మీడియా ప్రశ్నించినా కానీ ముందుకు వెళ్లే ముందు స్మైల్ ఇస్తూ అక్కడి నుంచి జారుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.