Begin typing your search above and press return to search.
చిన్న సినిమా చితగ్గొట్టేస్తోంది
By: Tupaki Desk | 31 July 2016 5:39 AM GMTదర్శకుడు కొత్తవాడు.. హీరో హీరోయిన్లు ఇంకా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నవాళ్లే. బ్యాగ్రౌడ్ కూడా లేదు. నిర్మాత కూడా పేరున్నవాడేమీ కాదు. సినిమా రెగులర్ కమర్షియల్ టైపు కూడా కాదు. ఇలాంటి నేపథ్యమున్న ఓ చిన్న సినిమా విడుదలకు ముందే పరిశ్రమ దృష్టిని ఆకర్షించడం.. పాజిటివ్ బజ్ మధ్య రిలీజవడం.. మంచి టాక్ సంపాదించుకుని మంచి కలెక్షన్లు సాధించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘పెళ్లిచూపులు’ ఆ కేటగిరీలోకే చేరింది. ఈ సినిమా హిట్టవడం గ్యారెంటీ అన్నది విడుదలకు ముందే తేలిపోయింది.
ఐతే విడుదల తర్వాత అది ఏ స్థాయి విజయం సాధిస్తుందనే విషయంలోనే కొంచెం సందేహాలున్నాయి. అర్బన్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే తరహా సినిమా కాబట్టి థియేటర్లు నిండిపోకపోవచ్చని.. కలెక్షన్లు ఓ మోస్తరు స్థాయిని దాటకపోవచ్చని అంచనా వేశారు. అందుకే ఈ చిత్రాన్ని పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేశారు. సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత అండ ఉన్నా.. భారీ రిలీజ్ కోసం ప్రయత్నించలేదు. కానీ రివ్యూలన్నీ పాజిటివ్ గా ఉండటం.. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరుగుతుండటం.. మౌత్ పబ్లిసిటీ కూడా బాగుండటంతో ‘పెళ్లిచూపులు’ సెన్సేషనల్ హిట్టయ్యే దిశగా దూసుకెళ్తోంది. మల్టీప్లెక్సుల్లో సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తుండగా సింగిల్స్ స్క్రీన్లు కూడా జనాలతో కళకళలాడుతున్నాయి. కలెక్షన్లు ఊహించినదానికంటే ఎక్కువే వస్తున్నాయి. అనుకున్నదానికంటే సినిమా పెద్ద హిట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అమెరికాలో ‘పెళ్లిచూపులు’ అదిరిపోయే కలెక్షన్లు సాధిస్తోంది. ప్రిమియర్లతో కలిపి శుక్రవారానికే 75 వేల డాలర్లు వసూలు చేసింది. వారాంతం అయ్యేసరికి ‘పెళ్లిచూపులు’ కలెక్షన్లు రూ.3 కోట్లను దాటుతాయని అంచనా వేస్తున్నారు. రూ.2 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన సినిమాకు అది పెద్ద మొత్తమే. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.7-8 కోట్లకు పైనే వసూళ్లు సాధించి పెట్టుబడితో పోలిస్తే బ్లాక్ బస్టర్ హిట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.