Begin typing your search above and press return to search.
పెళ్లిచూపులకే 10 కోట్లు చదివించారే
By: Tupaki Desk | 19 Aug 2016 4:22 AM GMTసాధారణంగా పెళ్ళిళ్లలో చదివింపులు ఉంటాయ్ కానీ.. మన టాలీవుడ్ లో పెళ్లిచూపులకు కూడా చదివింపులు బాగానే గిట్టుబాటు అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన పెళ్లిచూపులు మూవీ రెండు వారాల్లోనే 10 కోట్ల షేర్ ను అందుకుని.. సెన్సేషన్ సృష్టించింది.
ఏపీ.. తెలంగాణ.. బెంగళూరు.. చెన్నై.. మొత్తం ఇండియాలో కలిపి పెళ్లి చూపులకు ఇప్పటివరకూ 7.1 కోట్ల షేర్ వసూలైంది. ఇప్పటికే అమెరికాలో 9.76లక్షల డాలర్లు వసూలు చేసి మిలియన్ డాలర్ క్లబ్ కు చేరువైంది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ షేర్ 3.3 కోట్లు. అంటే మొత్తం ఈ మూవీకి వచ్చిన షేర్ 10.4 కోట్లన్నమాట. ఇండియాలో ఈ సినిమాని 1.5కోట్లకు విక్రయించగా.. ఇప్పటికే 4 రెట్లు వచ్చేసింది. ఇక అమెరికాలో అయితే 20వేల డాలర్లకే రైట్స్ ఇస్తే.. దీనికి 25 రెట్లను రాబట్టి పెట్టుబడి పరంగా అతి పెద్ద హిట్ గా నిలిచింది.
ఇంకా బీ సీ సెంటర్లను పెళ్లి చూపులు కవర్ చేయాల్సి ఉండగా.. ఫుల్ రన్ లో కనీసం 12 కోట్ల షేర్ వసూలు చేయడం సాధ్యమని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా స్ట్రెంగ్త్ అవుతున్న తీరు గమనిస్తే.. ఇంకా పెద్ద హిట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రోజురోజుకూ ఈ సినిమాకి పెరుగుతున్న రేంజ్ చూస్తే.. ఇంకా పెళ్లిచూపులకు సంచలనాలు.. రికార్డుల చదివింపులు చాలానే ఉన్నాయనిపిస్తోంది.