Begin typing your search above and press return to search.
పెళ్లిచూపులు సెన్సేషనల్ రికార్డు
By: Tupaki Desk | 15 Sep 2016 9:17 AM GMTఒకప్పుడు సినిమాల విజయాల్ని అర్ధశత దినోత్సవం.. శతదినోత్సవం సెంటర్ల లెక్కలతో కొలిచేవాళ్లు. మా హీరో సినిమా ఇన్ని కేంద్రాల్లో వంద రోజులాడింది.. 50 రోజులు ఇన్ని సెంటర్లలో పడ్డాయి అని గొప్పగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు సెంటర్ల సంగతి పక్కకు వెళ్లిపోయి కలెక్షన్ల లెక్కలు మాత్రమే చూస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకునే సినిమాలు కూడా నాలుగు వారాల తర్వాత థియేటర్లలో నిలవట్లేదు. 50 రోజుల పోస్టర్ పడటం చాలా కష్టమైపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే 50 రోజులు ఆడటం అన్నది గగనం అయిపోతుంటే.. ఇక అమెరికా లాంటి చోట్ల 50 రోజులు ఆడటం గురించి మాట్లాడుకోవడం అంటే అతిశయోక్తే అవుతుంది.
కానీ ‘పెళ్లిచూపులు’ సినిమా అమెరికాలో అనూహ్యమైన రికార్డు సాధించింది. అక్కడ ఆ చిత్రం 10 కేంద్రాల్లో యాభై రోజులు ఆడటం విశేషం. జులై 29న విడుదలైన ఈ సినిమా అమెరికాలో అదరగొట్టింది. ఏకంగా మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టింది. అంతే కాక లాంగ్ రన్ తోనూ ఆశ్చర్యపరిచింది. అమెరికాలో ఎంత పెద్ద సినిమా అయినా రెండు మూడు వారాలకు మించి ఆడవు. ఒక లొకేషన్లో 50 రోజులు ఆడినా ఆశ్చర్యమే. అలాంటిది పది సెంటర్లలో 50 రోజులు ఆడటమంటే మామూలు విషయం కాదు. అమెరికాలో తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ‘పెళ్లిచూపులు’ సినిమానే. పెట్టుబడి మీద 25 రెట్లకు పైగా వసూలు చేసిందీ సినిమా. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ సినిమాను మించిన బ్లాక్ బస్టర్ రావడం కష్టమే.