Begin typing your search above and press return to search.
ప్రకంపనలు రేపుతున్న చిన్న సినిమా
By: Tupaki Desk | 8 Aug 2016 6:23 AM GMTయుఎస్ తెలుగు ఆడియన్స్ టేస్టు కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు రొటీన్ మాస్ మసాలా సినిమాల పట్ల ఆసక్తి చూపించరు. కొత్తదనం ఉండాలి.. ఎంటర్టైనర్లు అయి ఉండాలి.. కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలి. ఈ లక్షణాలున్న సినిమాలైతే ఆ సినిమాకు దర్శకుడెవరు.. హీరో హీరోయిన్లు ఎవరు అన్నది కూడా పట్టించుకోరు. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా బాగా ఆదరిస్తారు. ‘పెళ్లిచూపులు’ విషయంలోనూ అదే జరుగుతోంది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ చిన్న సినిమా అక్కడ రెండో వారంలోనూ ప్రకంపనలు రేపుతోంది. ఈ చిత్రం ఈ శనివారం లక్ష డాలర్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంటే ఒక్క రోజులో దాదాపు 70 లక్షల రూపాయలన్నమాట.
దాదాపుగా అందరూ కొత్తవాళ్లతో ఓ కొత్త దర్శకుడు రూపొందించిన చిన్న సినిమా రెండో వారాంతంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. విడుదలైన తొలి రోజు నుంచి అంచనాల్ని మించి వసూళ్లు సాధిస్తున్న ఇప్పటికే ఈ సినిమా ఇప్పటికే 6.3 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఈ వారం రిలీజైన రెండు సినిమాలూ యుఎస్ ఆడియన్స్ టేస్టుకు సరిపోయేవే అయినా.. వాటికి పాజిటివ్ టాక్ వచ్చినా.. ‘పెళ్లిచూపులు’కే పట్టం కడుతున్నారు. ఉన్నంతలో మనమంతా కలెక్షన్లు బాగున్నాయి కానీ.. శ్రీరస్తు శుభమస్తు వసూళ్లు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి వసూలు చేస్తున్నదాని కంటే ‘పెళ్లిచూపులు’ ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. యుఎస్ హక్కుల కోసం ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడితో పోలిస్తే కనీసం 20 రెట్లు ఆదాయం రాబోతున్నట్లు అంచనా.