Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ ద‌గ్గ‌రికి పెళ్ళిచూపులు టీమ్‌

By:  Tupaki Desk   |   11 Aug 2016 6:56 AM GMT
స‌ల్మాన్ ద‌గ్గ‌రికి పెళ్ళిచూపులు టీమ్‌
X
కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌కి పెళ్ళిచూపులు సినిమా భ‌లే న‌చ్చింది. కొన్ని రోజులుకింద‌టే స‌బ్ టైటిల్స్‌తో ఆ సినిమాని చూసిన స‌ల్మాన్‌ఖాన్ ఇంప్రెస్ అయ్యాడ‌ట‌. ఇంత‌కీ ఆ సినిమా గురించి స‌ల్మాన్‌ఖాన్‌కి చెప్పిందెవ‌రో తెలుసా? రాజ‌మౌళి ఫాద‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. భ‌జ‌రంగీ భాయ్‌జాన్ నుంచి స‌ల్మాన్‌ఖాన్‌కీ, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌కీ మంచి దోస్తీ కుదిరింది. భ‌జ‌రంగీ క‌థ‌ని అందించింది కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాదే. ఆ అనుబంధంతోనే మా తెలుగులో ఓ మంచి సినిమా వ‌చ్చింది చూడండ‌ని స‌ల్మాన్‌ఖాన్‌కి చెప్పాడ‌ట విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. ఆ సినిమాని చూశాక హిందీలో త‌న సొంత బ్యాన‌ర్‌లో రీమేక్ చేద్దామ‌ని చెప్పాడ‌ట స‌ల్మాన్‌ఖాన్‌. దీంతో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పెళ్ళిచూపులు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్ని ముంబైకి తీసుకెళ్లి స‌ల్మాన్‌ఖాన్‌ని క‌లిపించాడు.

అన్నీ కుదిరితే తెలుగులో సినిమాని తీసిన త‌రుణ్‌భాస్క‌రే హిందీలోనూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. మొద‌ట పెళ్ళిచూపులు సినిమాని స‌ల్మాన్‌ఖాన్ చూస్తున్నాడ‌ని తెలియ‌గానే ఆయ‌నే న‌టిస్తాడేమో అనుకొన్నారంతా. కానీ స‌ల్మాన్‌ఖాన్ మాత్రం వేరొక హీరోతో ఆ సినిమా చేయించాల‌ని భావిస్తున్నాడ‌ట‌. రాజ‌మౌళి పాద‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాత్రం పెళ్లి వార్త‌ల‌తో త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తుంటారు కాబ‌ట్టి స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేయించి మీరు చేస్తేనే బాగుంటుంద‌ని స‌ల్మాన్‌ఖాన్‌కి స‌ల‌హా ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏ విష‌యం నాలుగైదు రోజుల్లో ఖ‌రారు కానుంది.