Begin typing your search above and press return to search.

1500 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించిన నిర్మాణ‌ సంస్థ‌

By:  Tupaki Desk   |   18 Jun 2021 11:30 PM GMT
1500 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించిన నిర్మాణ‌ సంస్థ‌
X
పెన్ స్టూడియోస్.. ఇటీవ‌ల పాన్ ఇండియా సినిమాల‌ను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్న పాపుల‌ర్ నిర్మాణ‌ సంస్థ‌. తాజాగా ఈ సంస్థ తన సినిమాల‌ లైనప్ ను ప్రకటించింది. ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ స‌హా ఆలియా భట్ - సంజయ్ లీలా భన్సాలీ కాంబినేష‌న్ మూవీ గంగూబాయి కతియావాడీలను ఈ సంస్థ అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నుంది. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్.. జాన్ అబ్రహం ఎటాక్.. చిత్రాల‌ను ఈ సంస్థ రిలీజ్ చేయ‌నుంది.

అలాగే ఈ సంస్థ స్ట్రెయిట్ గా ప‌లు భారీ సినిమాల్ని నిర్మిస్తోంది. రణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా హిందీలో అన్నీయన్ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తోంది. విక్ర‌మ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అప‌రిచితుడు (అన్నియ‌న్) అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. హిందీలోనూ అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది.

ప్ర‌స్తుతం అన్నియ‌న్ రీమేక్ హక్కులు త‌న‌కు చెందుతాయ‌ని ఆస్కార్ ర‌విచంద్ర‌న్ కోర్టులో కేసు వేయగా ఈ వివాదంపై క్లారిటీ రావాల్సి ఉంది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ కేవ‌లం పారితోషికం అందుకుంటారు..క్రియేటివిటీ హ‌క్కుల‌తో సంబంధం క‌లిగి ఉండ‌రు. అన్ని రీమేక్ హక్కులను కేవ‌లం నిర్మాత‌ ఆస్కార్ రవిచంద్రన్ కలిగి ఉన్నారని చెబుతున్నారు. అయితే స్క్రిప్టు ప‌రంగా క్రియేటివిటీ త‌న‌దిగా శంక‌ర్ భావిస్తున్నారు. రవిచంద్రన్ ఇప్పటికే శంకర్ పై సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశారు.

అలాగే బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా ఛ‌త్ర‌ప‌తి రీమేక్ ను వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో పెన్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ లో 3కోట్లతో భారీ సెట్ నిర్మించ‌గా ఇటీవ‌లి వ‌ర్షాల‌కు ఈ సెట డ్యామేజ్ అయ్యింద‌ని తెలిసింది. 500కోట్ల‌తో ఆర్.ఆర్.ఆర్ హ‌క్కులు కొన్నారు. అన్ని సినిమాల‌కు క‌లిపి దాదాపు 1500 కోట్లు పైగా వెచ్చిస్తున్న‌ పెన్ మూవీస్ జ‌యంతి లాల్ గ‌డ పేరు మార్మోగుతోంది. ఆయ‌న ఇండ‌స్ట్రీ బాస్ గా వెలిగిపోతున్నారు. మ‌రో ఐదు భారీ చిత్రాల‌కు ఆయ‌న స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది.