Begin typing your search above and press return to search.
అరవింద సమేత.. ఆయన కష్టం చాలా ఉంది
By: Tupaki Desk | 8 Oct 2018 9:16 AM GMTటాలీవుడ్లో స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో ఎవరి సాయం తీసుకోకుండా పూర్తిగా తమ రచనకే పరిమితం అయి.. తాము రాసిందే తీసే దర్శకులు చాలా తక్కువమంది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు. స్వతహాగా రచయిత కావడం.. అరంగేట్రం చేసింది కూడా రైటర్ గానే కావడంతో దర్శకుడిగా మారాక కూడా తన పెన్నునే నమ్ముకున్నాడు త్రివిక్రమ్. సినిమాలో కనిపించే ప్రతి సీన్లో.. వినిపించే ప్రతి మాటలో.. త్రివిక్రమ్ శైలి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ‘నువ్వే నువ్వే’ దగ్గర్నుంచి ‘అజ్ఞాతవాసి’ వరకు ప్రతి కథా త్రివిక్రమ్ దే. రచనలో వేరే వాళ్లకు క్రెడిట్ ఇవ్వలేదు. ఐతే ‘అరవింద సమేత’ విషయంలో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం చూడబోతున్నాం. త్రివిక్రమ్ తో పాటు పెంచల్ దాస్ రైటింగ్ క్రెడిట్ తీసుకోబోతున్నాడు.
‘కృష్ణార్జున యుద్ధం ’లో దారి చూడు పాటతో పాపులర్ అయిన పెంచల్ ను త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ కోసం ఉపయోగించుకున్న సంగతి ఇంతకముందే వెల్లడైంది. ఐతే సరిగ్గా ఈ సినిమా కోసం అతనేం చేశాడు అన్నది తెలియదు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు త్రివిక్రమ్. రాయలసీమ నేపథ్యాన్ని.. అక్కడి భాషను అథెంటిగ్గా చూపించాలనే ప్రయత్నంలో తాను పెంచల్ దాస్ సాయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. అక్కడి పరిస్థితుల గురించి తనకు మరింత అవగాహన కల్పించి.. డైలాగుల విషయంలో సాయం చేశాడని.. 90 శాతం వరకు అథెంటిగ్గా అక్కడి పరిస్థితులు.. భాషను తెరపైకి తెచ్చామని చెప్పాడు. ‘అరవింద సమేత’ షూటింగ్ మొత్తం పెంచల్ యూనిట్ తో పాటే ఉన్నాడని.. నటీనటులకు డైలాగుల విషయంలో సాయం చేశాడని.. డబ్బింగ్ దగ్గర కూడా ఉన్నాడని.. అతడి సహకారం మరువలేనిదని చెప్పాడు. అలాగే సినిమాలో అతను ఒక పాట కూడా రాశాడన్నాడు. కాబట్టి ‘అరవింద సమేత’లో పెంచల్ కష్టం చాలానే ఉందన్నమాట.