Begin typing your search above and press return to search.

పాట‌లో వ‌ర్మ‌..బాబు గోగినేని..వీర మాచినేని!

By:  Tupaki Desk   |   25 Aug 2018 4:38 AM GMT
పాట‌లో వ‌ర్మ‌..బాబు గోగినేని..వీర మాచినేని!
X
స‌రైన పాట ఒక్క‌టి చాలు.. సినిమా మీద బోలెడంత క్రేజ్ పెంచ‌టానికి. కొన్ని సంద‌ర్భాల్లో పాట‌ల పుణ్య‌మా అని సినిమా మీద అంచ‌నాలు భారీగా పెరిగిపోతాయి. అయితే.. పాటే సినిమాను సూప‌ర్ హిట్ చేస్తుంద‌న్న పెద్ద మాట‌లు చెప్ప‌టం లేదు కానీ.. పాట సినిమాకు స్థాయిని ప్ర‌భావితం చేయ‌టంలో మాత్రం కీల‌క‌మ‌వుతుంది.

కృష్ణార్జున యుద్ధం మూవీలో దారి చూడు అంటూ త‌న‌దైన గాత్రంతో ఫోక్ సాంగ్ పాడి అంద‌రి మ‌న‌సుల్ని దోచేశాడు పెంచ‌ల్ దాస్‌. ఆ సినిమా స‌క్సెస్ సంగ‌తి ఎలా ఉన్నా.. ఆ పాట మాత్రం సూప‌ర్ హిట్టు. ఈ పాట‌తో సినిమా పేరు చాలామంది నోటిలో నానింది.

తాజాగా మ‌రో మంచి ఫోక్ ట్యూన్ తో సంద‌డి చేయ‌బోతున్నాడు పెంచ‌ల్ దాస్‌. చాలా కాలంగా మంచి హిట్టు కోసం ప‌రి త‌పిస్తున్న అల్ల‌రి న‌రేష్.. సునీల్ క‌థానాయ‌కులుగా చేస్తున్న మూవీ సిల్లీ ఫెలోస్. ఈ సినిమాలో హెడ్డేకురా మామా.. హెడ్డేకురా.. లైఫంటే పెద్ద హెడ్డేకురా.. ప్రేమ అంటే మ‌రింత హెడ్డేకురా అంటూ ఓ ఫోక్ ట్యూన్ పాడేశారు దాస్.

కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌కు వ‌సంత్ ట్యూన్ అందించారు. ఈ పాట ప్ర‌త్యేక‌త ఏమంటే.. త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే ఆర్జీవీ.. క్రిటిక్స్.. ట్వీట్ లాంటి స‌ర‌దా సంగ‌తుల‌తో పాటు.. బాబు గోగినేని.. వీర మాచినేని గురించి కూడా స‌ర‌దాగా ప్ర‌స్తావించ‌టం. ప‌నిలో ప‌నిగా సినిమా రేటింగ్ ల మీదా ఈ మూవీలో ట‌చ్ చేశారు. వ‌చ్చే నెల ఏడున విడుద‌ల‌య్యే ఈ మూవీకి ఈ పాట ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారుతుంద‌ని చెబుతున్నారు.

ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయ‌టంలో ఈ సాంగ్ కీల‌క‌మ‌వుతుంద‌ని భావిస్తున్న చిత్ర బృందం.. ఈ పాట‌ను ముందుగానే విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ పాట అంద‌రి నోళ్ల‌ల్లో నాన‌టం ఖాయ‌మంటున్నారు.