Begin typing your search above and press return to search.

ఈ మోషన్ పోస్టరేదో బాగుందే..

By:  Tupaki Desk   |   23 March 2016 7:30 AM GMT
ఈ మోషన్ పోస్టరేదో బాగుందే..
X
సింపుల్ గా ఉంటూనే బ్యూటిఫుల్ అనిపిస్తోంది.. తమిళ సినిమా ‘పెన్సిల్’ మోషన్ పోస్టర్. మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా.. తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. మణి నాగరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను తెలుగులోకి అదే పేరుతోనే అనువదిస్తున్నారు. ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న హరి.. ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ‘పెన్సిల్’ మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం విశేషం. ఈ మోషన్ పోస్టర్ సింప్లీ సూపర్బ్ అనిపించేలా ఉంది. డైరెక్టర్ హరీష్ శంకర్ తో పాటు కొందరు టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం మోషన్ పోస్టర్ చూసి ముచ్చటపడిపోయారు.

హీరో హీరోయిన్లు ఇందులో పన్నెండో తరగతి చదివే స్టూడెంట్స్ గా నటిస్తున్నారు. వాళ్లిద్దరూ స్కూల్ డ్రెస్సులో ఉన్న లుక్స్ ను మోషన్ పోస్టర్లో పరిచయం చేశారు. సినిమాలో పెన్సిల్ పాత్ర ఏంటో కానీ.. ప్రకాష్ - శ్రీదివ్య ఇద్దరూ పెన్సిళ్ళు ముక్కుతో పట్టుకుని బుంగమూతితో కనిపిస్తున్నారు. టైటల్ కూడా పెన్సిల్ రైటింగ్ తో వెరైటీగా డిజైన్ చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఈరోస్ ఇంటర్నేషనల్’ నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. జి.వి.ప్రకాష్ కుమారే స్వయంగా సంగీతాన్నందిస్తున్నాడు. జి.వి హీరోగా నటించిన డార్లింగ్ - త్రిష ఇల్లాన నయనతార పెద్ద హిట్లయిన నేపథ్యంలో ఈ సినిమాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. మే నెలలో ‘పెన్సిల్’ తమిళ - తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది.