Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ :ఉత్కంఠకు గురి చేస్తున్న మహానటి 'పెంగ్విన్'...!
By: Tupaki Desk | 11 Jun 2020 7:50 AM GMT'మహానటి' సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం 'పెంగ్విన్'. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ - ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో కార్తికేయన్ సంతానం - కాల్ రామన్ - ఎస్.సోమసేగర్ - కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 19న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు చిత్ర యూనిట్. ఇటీవల హీరోయిన్స్ సమంత త్రిష తాప్సి మంజువారీయర్ చేతుల మీదుగా 'పెంగ్విన్' టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 'మీ అందరి కథల వెనుక ఓ అమ్మ కథ ఉంది. ఎందుకంటే మీ ప్రయాణం ప్రారంభించేది ఆమె నుంచే..' అని టీజర్‌లో చూపించారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని తెలుగులో హీరో నాని.. మలయాళంలో మోహన్ లాల్.. తమిళ్ లో ధనుష్ రిలీజ్ చేసారు.
థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ లో కొడుకును కోల్పోయి వెతుకులాట ప్రారంభించిన తల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది. ట్రైలర్ చివరలో కనిపించే ఆ సైకో ఎవరనే ఆసక్తిని కలిగిస్తోంది. అపహరణకు గురైన కొడుకు కోసం తల్లి పడే వేదన.. కొడుకును దక్కించుకునేందుకు చేసే పోరాటం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. దీనికి సంతోష్ నారాయణ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆద్యంతం ఉత్కంఠగా ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ ఫలని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులని తప్పక అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. 'మహానటి' కీర్తి సురేష్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.