Begin typing your search above and press return to search.
అన్నీ సవ్యంగా జరిగుంటే నేడు 'ఆర్.ఆర్.ఆర్' చూస్తూ ఉండేవాళ్ళం...!
By: Tupaki Desk | 30 July 2020 1:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఇప్పటికే రెండుసార్లు విడుదల తేదీలను మార్చుకున్న 'ఆర్.ఆర్.ఆర్' చివరగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల అవుతుందని ప్రకటించారు.
కాగా 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ ముందుగా చెప్పినట్లు 2020 జూలై 30న అంటే ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ రిలీజ్ డేట్ ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. థియేటర్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లున్న మీమ్స్ షేర్ చేస్తున్నారు. మరికొందరు 'ఎన్టీఆర్ - చరణ్ అద్భుతమైన నటన కనబరిచారు.. ఫైట్లు ఇరగదీశారు.. ఇంటర్వెల్ అదిరిపోయింది.. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది' అంటూ రివ్యూలు చెప్పేస్తూ పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ రాజమౌళి కరోనా సోకిందని ట్వీట్ చేస్తే.. దానికి కూడా నెటిజన్స్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ జులై 30ని గుర్తు చేసుకుంటూ ''అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటేనా.. థియేటర్ల ముందు ఒక రేంజ్‌లో సెలబ్రేషన్స్ ఉండేవి. కానీ ఏం చేద్దాం.. గెట్ వెల్ సూన్'' అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే నాలుగున్నర నెలల కాలం వేస్ట్ గా పోయింది.. మళ్ళీ ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి.. మరోవైపు రాజమౌళితో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ కరోనా బారిన పడ్డారు.. ఒకవేళ షూటింగ్స్ స్టార్ అయి శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్నా గ్రాఫిక్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తవుతుందో లేదో అనే డౌట్.. ఇక బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం కోసం రాజమౌళి సినిమా విడుదలలో ఎంత జాప్యమైనా పట్టించుకోరనే విషయం తెలిసిందే.. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే 2021 సంక్రాంతికి 'ఆర్.ఆర్.ఆర్' కష్టమే అని చెప్పవచ్చు.