Begin typing your search above and press return to search.
అల్లరోడి రేంజ్ మరీ ఇంతగా తగ్గిందా?
By: Tupaki Desk | 24 Jan 2021 11:30 PM GMTఅల్లరి నరేష్ అంటే గతంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు దక్కించుకున్నాడు. కాని ఇప్పుడు ఆయన సినిమా అంటే జనాలు లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అల్లరి నరేష్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు అని మరోసారి నిరూపితం అయ్యింది. తాజాగా నరేష్ నటించిన 'బంగారు బుల్లోడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సినిమాల జోరు తగ్గింది. అయినా కూడా సినిమా ను మాత్రం జనాలు పట్టించుకోలేదు. సినిమాలు పెద్దగా ఏమీ లేకపోయినా కూడా బంగారు బుల్లోడు సినిమాకు మొదటి రోజు కనీసం 70 లక్షల రూపాయల షేర్ అయిన రాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తుగానే ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం ఈ ఓపెనింగ్స్ తో కష్టమే అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాలు ఒక మోస్తరుగా మంచి వసూళ్లను నమోదు చేస్తున్నాయి. కాని ఈ సినిమా మాత్రం చాలా నిరాశ పర్చింది. 1.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో అయినా ప్రేక్షకులను రప్పించి కనీసం 4 నుండి 5 కోట్ల షేర్ ను అయినా రాబడుతుందా అనేది ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అల్లరి నరేష్ చేస్తున్న కామెడీ స్టైల్ మార్చుకోవాలంటూ సినిమా ఎంపిక విషయంలో కాస్త కొత్తగా ప్రయత్నించాలంటూ అభిమానులు నెట్టింట కోరుతున్నారు. మరి అల్లరోడి తదుపరి సినిమా అయినా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.