Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ దెబ్బకు సెలబ్రిటీలను మర్చిపోయిన జనాలు?

By:  Tupaki Desk   |   8 April 2020 4:00 AM GMT
లాక్ డౌన్ దెబ్బకు సెలబ్రిటీలను మర్చిపోయిన జనాలు?
X
కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండడంతో భారతదేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో పలు రంగాలపై తీవ్రమైన ప్రభావం పడింది. సినిమా థియేటర్లు మూతపడడంతో కొత్త సినిమాల విడుదల అనే మాటను మర్చిపోయారు. థియేటర్లు మళ్ళీ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో.. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో జనాలు కూడా కొత్త సినిమాల సంగతే మర్చిపోయారు.

దీంతో పాటు చాలామంది హీరోలు.. హీరోయిన్లను కూడా మర్చిపోయారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో సాధారణ జనాలకు సినిమా సెలబ్రిటీలు ఎవరు గుర్తున్నారనే విషయంప సరదాగా ఒక సర్వే నిర్వహిస్తే దానికి వచ్చిన ఫలితాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మీకు గుర్తున్న టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు చెప్పమంటే అందరూ ముందుగా నటసింహ నందమూరి బాలకృష్ణ పేరు చెప్పడం విశేషం.

ఆ తర్వాత చిరంజీవి.. వెంకటేష్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. నాగార్జున.. సమంతా.. రామ్ చరణ్.. ఎన్టీఆర్.. రాజమౌళి ప్రభాస్.. పూరి జగన్నాధ్.. ఛార్మీ పేర్లు చెప్పారు. ఇక విజయ్ దేవరకొండ.. రష్మిక.. నితిన్ తదితరుల పేర్లు గుర్తు చేస్తే.. అప్పుడు "అవును.. తెలుసు" అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది.. ఇంకేమీ అవసరం లేదనుకునే హీరోలు ఈ విషయంలో ఇకనైనా మేలుకుంటే మంచిది. లేకపోతే లాక్ డౌన్ కాలం పూర్తయ్యేలోపు చాలామందిని మర్చిపోయేలా ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.