Begin typing your search above and press return to search.
మైత్రీకి ధీటుగా మరో సంస్థ ట్రాక్‌లోకి!
By: Tupaki Desk | 20 Sep 2022 12:30 AM GMTతెలుగులో క్రేజీ ప్రడక్షన్ కంపనీలు చాలానే వున్నాయి. వీటి మధ్య చాలా కాలంగా ఆసక్తికరమైన, ఆరోగ్యకరమైన పోటీ నెలకొని వుంటోంది. చాలా వరకు మేకింగ్ కంపనీలు స్టార్ హీరోలకు మాత్రమే స్ట్రక్ అయిపోయి వుండకుండా టైర్ టు హీరోలతో పాటు మినిమయ్ గ్యారెంటీ హీరోలు, యంగ్ అప్ కమింగ్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తూ లైమ్ లైట్ లో ప్రధానంగా నిలుస్తున్నాయి. అప్పట్లో ప్రధానంగా రెండు సంస్థలపై పోటీ వుండేది.
గీతా ఆర్ట్స్ వర్సెస్ సురేష్ ప్రొడక్షన్స్. ఈ రెండు సంస్థలు గతంలో టాలీవుడ్ లో పోటీపడి మరీ స్టార్ లతో సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఈ సంస్థలు కూడా స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి పోటీపడ్డాయి. సూపర్ హిట్ లని, బ్లాక్ బస్టర్లని అందించాయి. అయితే మారిన జనరేషన్, సమీకరణాల వల్ల తమ పంథా మార్చుకుని ఇప్పడు సినిమాల నిర్మాణం చాలా వరకు తగ్గించుకున్నాయి.
సురేష్ ప్రొడక్షన్స్ ఇతర సంస్థలతో కలిసి చిన్న సినిమాలు నిర్మిస్తుంటే గీతా ఆర్ట్స్ మాత్రం పెద్ద సినిమాలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ తరహాలోనే చిన్న సంస్థలతో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. కాల క్రమేనా గీతా ఆర్ట్స్ వర్సెస్ సురేష్ ప్రొడక్షన్స్ మధ్య పోటీ కాస్తా గీతా వర్సెస్ దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ మధ్య పోటీగా మారింది. ఆ తరువాత అనూహ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ లీడ్ లోకి వచ్చేసి టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు నిర్మిస్తున్నా స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది.
ప్రస్తుతం ఈ సంస్థ ఇప్పటికే నాలుగు సినిమాలని ఈ ఏడాది అందించింది. ప్రస్తుతం మరో నాలుగు భారీ ప్రాజెక్ట్ లు సెట్స్ పై వున్నాయి. నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న మూవీ, చిరంజీవితో బాబీ తెరకెక్కిస్తున్న `వాల్తేరు వీరయ్య`, విజయ్ దేవరకొండ, సమంత కలయికలో రూపొందుతున్న `ఖుషీ`, త్వరలో బన్నీ హీరోగా ప్రారంభం కానున్న `పుష్ప 2` వున్నాయి.
ఇదిలా వుంటే అనూహ్యంగా ఈ స్టార్ ప్రొడక్షన్ హౌస్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పోటీపడబోతోంది. రీసెంట్ గా పాన్ ఇండియా వైడ్ గా `కార్తికేయ 2`తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రత్యక్ష్యంగా పరోక్షంగా ఎనిమిది ప్రాజెక్ట్ లని నిర్మిస్తూ లీడింగ్ లో వుంది. పవన్ కల్యాణ్ తో ఓ ప్రాజెక్ట్, రవితేజతో `ధమాకా`, నాగశౌర్యతో `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` వంటి సినిమాలతో పాటు కన్నడలోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మైత్రీ వర్సెస్ పీపుల్ మీడియాగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.