Begin typing your search above and press return to search.
మర్డర్ మిస్టరీ పై మండిపడుతున్న జనాలు!
By: Tupaki Desk | 9 Feb 2022 6:09 AM GMTఇప్పుడంత వెబ్ సిరీస్ లదే హవా. సరైన కంటెంట్ పడితే అందులో నటీనటులకు..సాంకేతిక నిఫుణులకు మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయి. ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్లగా మారిపోతున్నారు. ఇక్కడ కేవలం కంటెంట్ మాత్రమే ప్రధాన పాత్ర పోసిస్తోంది. `సేక్రెడ్ గేమ్స్`.. `మీర్జాపూర్`.. `స్కామ్ 1992` లాంటి వెబ్ సిరీస్ లు ఎలాంటి సక్సెస్ సాధించాయో తెలిసిందే.
రిలీజ్ కి ముందు వీటికి పెద్దగా ప్రచారం లేకపోయినా కంటెంట్ తో దూసుకుపోయాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా ఆ జాబితాలో `ది గ్రేట్ ఇండియన్` మర్డర్ కూడా చేరింది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లగా తెరకెక్కిన ఈ సిరీస్ పెద్ద సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
పైగా ఈ వెబ్ సిరీస్ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నిర్మించడంతో మొదటి నుంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ప్రచారం పరంగా అంత రీచ్ అవ్వనప్పటికీ కంటెంట్ పరంగా అందర్నీ ఆకట్టుకుంది. రెగ్యులర్ ఓటీటీ ఆడియన్స్ మాత్రం కాస్త నిరాశకు గురైన తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారు.
చత్తీస్ ఘడ్ లో జరిగిన ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హోంమంత్రి జగన్నాథ్ రాయ్ (అశుతోష్ రాణా) కుమారుడు విక్కీ రాయ్ (జతిన్ గోస్వామి) హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో విక్కీ పట్టుబడగా హై కోర్టు దోషిగా నిర్ధారించినా.. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బెయిల్‌పై విడుదలవుతాడు.
ఆ ఆనందంలో విక్కీ ఢిల్లీలోని ఫామ్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేయగా అక్కడే కాల్చి చంపబడతాడు. తూటా ఎవరు పేల్చారు? అన్నది సిరీస్ లో సస్పెన్స్. ఈ కేసులో ఆరుగురు అనుమానితులు ఉంటారు. రచయిత వికాస్ స్వరూప్ రచించిన బెస్ట్ సెల్లింగ్ బుక్ రేసీ మర్డర్ మిస్టరీ 'సిక్స్ సస్పెక్ట్స్' ఆధారంగా 'ది గ్రేట్ ఇండియన్ మర్డర్' సిరీస్ ని తిగ్మాన్షు ధులియా తెరకెక్కించారు.
ఇందులో స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ..రిరోయిన్ రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈసిరీస్ పై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత కూడా వ్యక్త మైంది. కొన్ని పాత్రల్ని జోకర్లుగా చిత్రీకరించారని నెటి జనులు మండిపడ్డారు.