Begin typing your search above and press return to search.
సామాన్యుడిలా జిలేబి పకోడి తిన్న చిరు
By: Tupaki Desk | 22 May 2019 5:04 AM GMTరోమ్ వెళితే రోమన్ లా ఉండాలి కానీ.. పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి ఆడియోకి వెళితే ఎలా ఉండాలి? అన్నది ఎందరికి తెలుసు? ఎదిగినా ఒదిగి ఉండాలి! అన్న మాట పదే పదే చెప్పడమే కాదు.. దానిని తూ.చ తప్పక ఆచరించి చూపించడంలోనూ మెగాస్టార్ చిరంజీవి నికార్సయిన వ్యక్తిత్వాన్ని చూపించారు. ఆయన కోరుకుంటే ఫైవ్ స్టార్ మెనూనే తన వద్దకు నడిచొస్తుంది. కానీ ఆయన ఒక సామాన్యుడిలా పకోడీ తిన్నారు. జిలేబీని ఎంతో ఆప్యాయంగా తింటూ అందరినీ పలకరించారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆహ్వానం మేరకు `మార్కెట్లో ప్రజాస్వామ్యం` ఆడియో ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి(63) తన ఫుడ్డింగ్ హ్యాబిట్ ని .. ప్రోటోకాల్ ని పక్కన పెట్టి సామాన్యుడిలా మారిపోయారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ కి వచ్చేసి అక్కడ తనకు ఎంతో ఆప్యాయంగా పకోడీ ప్లేట్ అందించిన నారాయణ మూర్తితో కలిసి పరవశించిపోతూ పకోడీ తిన్నారు. ఆ మొత్తం సీన్ చూస్తున్న వారికి మాత్రం అస్సలు నోట మాట రాలేదు. సైరా కోసం మెగాస్టార్ చాలా వరకూ బరువు తగ్గారు. స్ట్రిక్ట్ డైట్ మెయింటెయిన్ చేస్తున్నారు. అనవసరమైన ఆయిల్ ఫుడ్స్ ఆయన తీసుకోరు. అయితే ఆ స్ట్రిక్ట్ నెస్ అంతా ఈ ఒక్కసారికి వదిలేశారు. అది కూడా తన మిత్రుడు నారాయణ మూర్తి కోసం.
ఈ దృశ్యం చూసిన మీడియాకి దిమ్మ తిరిగింది. దీనిపై తెలుగు సినీమీడియాలో ఎంతో ఆసక్తికరంగా ముచ్చట సాగింది. మెగాస్టార్ అంత గొప్ప స్థాయికి ఎందుకు ఎదిగారో ఇప్పుడైనా అర్థమైందా? ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప గుణాన్ని ఆయన అలవరుచుకుని మెగా కాంపౌండ్ హీరోలకు అలవాటు చేశారు కాబట్టే ఆ కాంపౌండ్ అలా ఎదిగేస్తోంది! అంటూ పలువురు ముచ్చటించుకోవడం ఆసక్తిని కలిగించింది. ఆడియో వేదికపై చిరు మాట్లాడుతూ.. కష్టాన్ని నమ్ముకుని దీక్షతో పోరాడి ఈ రోజు జనాలతో పీపుల్స్ స్టార్ అనిపించుకున్నారని నారాయణ మూర్తిని ప్రశంసించారు. ఏఎన్నార్ తర్వాత తెలుగు సినిమాల్లో డ్యాన్సుల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన ఘనత చిరుదే అని నారాయణ మూర్తి ప్రతిగా ప్రశంసించడం విశేషం. ఆడియోకి విచ్చేసినందుకు మీ సంస్కారానికి నమస్కారం అని అన్నారు. బాలీవుడ్ కి ఏకంగా 28 మంది వారసుల్ని ఇచ్చింది పృథ్వీరాజ్ కపూర్ కుటుంబం అయితే టాలీవుడ్ కి డజను మంది స్టార్లను ఇచ్చింది మెగా ఫ్యామిలీ అంటూ నారాయణ మూర్తి కీర్తించారు. ఒక ప్రాంతీయ భాషా పరిశ్రమకు పిల్లర్ గా మెగాస్టార్ నిలిచారని కీర్తించారు.