Begin typing your search above and press return to search.

రోజుకు రూ. 50 లక్షల పూజ మామూలుగా ఉండదు

By:  Tupaki Desk   |   15 April 2022 6:30 AM GMT
రోజుకు రూ. 50 లక్షల పూజ మామూలుగా ఉండదు
X
పూజా హెగ్డే జోరు మామూలుగా లేదు... ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా దూసుకు పోతుంది. రాధేశ్యామ్‌ నిరాశ పర్చినా కూడా ఆమె నుండి బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు రాబోతున్నాయి. తాజాగా ఈ అమ్మడు దక్కించుకున్న ఆఫర్‌.. దానికి ఆమె తీసుకుంటున్న పారితోషికం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి ఓ రేంజ్‌ లో సక్సెస్ అయ్యింది. సినిమాకు ఐటెం సాంగ్‌ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆ పాట ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కూడా మంచి ఆధరణ దక్కించుకుంటుంది అంటే కారణం సమంత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే తరహా ఐటెం సాంగ్ తో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోయిన్‌ గా పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు ఐటెం సాంగ్ ఆఫర్‌ వచ్చంది. కేవలం మూడు రోజుల డేట్లు కావాలని అడిగిన దిల్ రాజును ఆమె ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఎఫ్ 3 సినిమా కోసం పూజా హెగ్డే ఐటెం సాంగ్‌ కన్ఫర్మ్‌ అయ్యిందని ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

పూజా హెగ్డే ఐటెం సాంగ్‌ వల్ల ఖచ్చితంగా సినిమా కు అదనపు ఆకర్షణ మరియు స్పెషల్‌ గా ఉంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గానే కాకుండా గతంలో కూడా ఐటెం సాంగ్స్ చేసింది. అయితే ఇప్పుడు ఐటెం సాంగ్స్ చేయడం చాలా స్పెషల్‌ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఐటెం సాంగ్స్ తో హీరోయిన్స్ సందడి చేస్తున్న నేపథ్యంలో పూజా హెగ్డే బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ను చేసేందుకు సిద్దం అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ తో స్టార్‌ హీరోయిన్స్ కోట్లలో పారితోషికాలు దక్కించుకుంటున్నారు. కనుక పూజా కూడా కేవలం మూడు రోజులకే కోటిన్నర పారితోషికం దక్కించుకుంటుంది. రోజుకు 50 లక్షల పారితోషికం అంటే ఖచ్చితంగా రికార్డ్‌ బ్రేకింగ్‌ అనడంలో సందేహం లేదు.