Begin typing your search above and press return to search.
'ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పారు'
By: Tupaki Desk | 29 Sep 2021 1:03 PM GMTఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తో టాలీవుడ్ సినీ నిర్మాతలు ఈరోజు భేటీ అయ్యారు. మచీలిపట్నంలో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు - బన్నీ వాసు - సునీల్ నారంగ్ - వంశీ రెడ్డి - మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ - డీవీవీ దానయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలతో పాటుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించారు. భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపుతోందని తెలిపారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని సినీ పెద్దలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని.. వారి అభిప్రాయాలను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి పేర్ని నాని అన్నారు.
''ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెద్దలు నాతో ఫోన్ లో సంప్రదించారు. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆడియో ఫంక్షన్ లో జరిగిన సంఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇలా జరగకుండా ఉండాల్సింది.. దురదృష్టవశాత్తు జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఊటీలో షూటింగ్ లో ఉన్నాను.. వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతానని చెప్పారు. మొన్న ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని.. మేము ఆ భావంతో లేమని చిరంజీవి గారు చెప్పారు. చాలా మంది దర్శకులు నిర్మాతలు కూడా దీనిపై మాట్లాడారు'' అని మంత్రి నాని తెలిపారు. ఒక వ్యక్తి మాటలను మొత్తం ఇండస్ట్రీ మాటలుగా భావించమని వారికి భరోసా ఇచ్చామని అన్నారు.
సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని.. ఇప్పటికే ఆన్ లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతుందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకే నిర్మాతల వచ్చారన్నారు. ఇప్పుడు ప్రోడక్షన్ కాస్ట్ పెరిగిందని.. టికెట్ రేటు తక్కువగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతల బృందం తెలిపినట్లు మంత్రి చెప్పారు.
కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని.. ఇప్పటి వరకు థియేటర్లో ఉన్న 50 శాతం ఆక్యూపెన్సీని వంద శాతానికి పెంచాలని నిర్మాతలు కోరినట్లు నాని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయలకు తాము ఏకీభవించడం లేదని.. పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు సిద్దమని వారు చెప్పినట్లు పేర్ని నాని తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వల్ల దురదృష్టకర పరిణామాలు తలెత్తాయని మంత్రి నాని ఈ సందర్భంగా అన్నారు.