Begin typing your search above and press return to search.

చిరంజీవికి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలి

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:21 PM GMT
చిరంజీవికి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలి
X
ఏపీలో సినిమా టికెట్ల ధరపై సీఎం జగన్ తో చర్చించేందుకే చిరంజీవి వెళ్లారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. చిరంజీవి పై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సీఎంతో చర్చించేందుకు హీరో చిరంజీవి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని.. సినిమాపరిశ్రమ నుంచి ఎవరూ కూడా ఈ విషయంలో ఏపీ సర్కార్ పై విమర్శలు చేయవద్దని చిరంజీవి సూచించారు.

చిరంజీవికి మంత్రి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాపై అనర్హత వేటు వేయించలేమని వైసీపీ చెబితే తక్షణం రాజీనామా చేస్తానన్నారు. క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నానని.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతోందని రఘురామ అన్నారు.

ఇక తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును సీఎం జగన్ నిలిపివేయించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ను కోరినట్లు తెలిపారు.ఇక పీఆర్సీ అంశంపైనా రఘురామ స్పందించారు. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసరపరిస్థితి తలెత్తుతుందని.. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలుచెల్లించడం ప్రభుత్వ విధి అని రఘురామ వ్యాఖ్యానించారు.

సినిమా టికెట్ల వివాదం పతాక స్థాయికి చేరిన వేళ మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జగన్ లంచ్ కు పిలిచి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అగ్రనటుడు చిరంజీవి టాలీవుడ్‌కి పెద్దదిక్కుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల అభ్యర్థనలను ముందుకు తీసుకొచ్చారు. దీనిపై వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి ఇరువర్గాలను సంతృప్తిపరిచే పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు. అయితే, చిరంజీవిపై తాజాగా పేర్ని నాని కామెంట్స్ తో హీట్ పెరిగింది. అందుకే చిరంజీవికి సారీ చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు.