Begin typing your search above and press return to search.
అనసూయపై పర్సనల్ కామెంట్స్.. ఆవేదనతో స్టేజ్ దిగి వెళ్లిపోయింది!
By: Tupaki Desk | 19 Jun 2021 11:00 PM ISTయూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ ఫేమస్ అయిన యాంకర్ శివ.. జబర్దస్త్ హోస్ట్ అనసూయపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా జబర్దస్త్ వేదికమీదనే కావడం గమనార్హం. దీంతో.. అవమానంగా భావించిన అనసూయ.. స్టేజ్ దిగి వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
అనసూయ పర్సనల్ గా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. 'నాకు నచ్చినట్టు నేనుంటా.. ఇట్స్ మై లైఫ్' అని పాడుకుంటూ ఉంటుంది. సామాజిక అంశాలపై స్పందించడం నుంచి.. మోడ్రన్ డ్రెస్సులు వేసుకునే వరకూ ఏ విషయంలోనూ, ఎవరికోసమూ కాంప్రమైజ్‌కాదు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా సర్వ సాధారణమే. వాటిని అనసూయ కూడా ధీటుగానే ఎదుర్కొంటూ ఉంటుంది.
అయితే.. తాజాగా జబర్దస్త్ వేదిక మీదనే ఈ డిస్కషన్ మొదలు పెట్టాడు యాంకర్ శివ. హైపర్ ఆది టీమ్ లో గెస్ట్ గా వచ్చిన శివ.. ''మీరు చిన్న చిన్న డ్రస్సులు వేసుకుంటారు ఎందుకు?'' అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఆన్సర్ ఇస్తూ.. అది తన పర్సనల్ విషయం అని చెప్పింది.
అంతటితో వదిలిపెట్టని శివ మరింత రెచ్చగొట్టాడు. 'అలాగైతే ఇంట్లో వేసుకోవాలి' అని అన్నాడు. దీంతో.. అందరూ షాకయ్యారు. అవమానంగా భావించిన యాంకర్ అనసూయ.. స్టేజ్ దిగి వెళ్లిపోతుంది. ఇదీ.. జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో. ఈ నెల 24న ప్లే కానుంది. మరి, ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.