Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ ను డాడీ అని పిలుస్తాడట!
By: Tupaki Desk | 4 Dec 2017 4:37 AM GMTచదువుకు.. చేసే పనికి అస్సలు సంబంధం ఉండదు. ఆ మాటకు వస్తే చదువు ఏ మాత్రం లేకున్నా.. ప్రతిభతో అత్యుత్తమ స్థానాలకు చేరుకున్న వారు బోలెడంతమంది కనిపిస్తారు. చిత్రపరిశ్రమలో ఇలాంటి వారు కొందరు కనిపిస్తారు. చదువు లేకున్నా.. తమ రంగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించే వీరికి ఉండే స్టార్ డమ్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటోళ్లలో ఒకరు ప్రముఖ స్టంట్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్.
ఒకప్పుడు సినిమా స్టంట్ సీన్లలో ఫైటర్ గా కనిపించిన హెయిన్స్.. తర్వాతి కాలంలో ఎదగటమే కాదు.. తన ప్రతిభతో స్టంట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ స్థాయిలో రాణించాడు. నిలువెత్తు స్ఫూర్తి కథకు నిదర్శనంగా కనిపించే పీటర్ హెయిన్స్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.
జాతీయస్థాయిలో సినిమాలు చేస్తున్నా.. హెయిన్స్ ట్రాక్ రికార్డును చూస్తే.. ఎక్కువగా రాజమౌళి చిత్రాల్లో పని చేయటం కనిపిస్తుందా. జక్కన్న స్కూల్లో కీరోల్ ప్లే చేసే పీటర్ హెయిన్స్‌కు మరో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఎంతో ఇష్టమట. ఆయన్ను ప్రేమతో డాడీ అనిపిస్తుంటాడట.
తన తండ్రి తనను చదివించకున్నా.. మార్షల్ ఆర్ట్స్ నేర్పించారని.. అదే తనకు జీవితమైందని చెబుతాడు. సినిమా రంగంలో త్రివిక్రమ్ దగ్గర ఎంతో నేర్చుకున్నానని.. అందుకే ఆయన్ను ప్రేమతో డాడీ అని పిలుస్తానని చెప్పాడు. తాను చేసిన సినిమాల్లో అన్ని ఇష్టమేనని.. అన్ని తన బిడ్డలేనని..వాటిల్లో మంచిదంటూ ఏమీ ఉండదని చెప్పుకొచ్చాడు. ఫైట్లే కాదు.. మాటలు కూడా హెయిన్స్ కు బాగానే వచ్చినట్లుందే!