Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ టైటిల్‌ కన్ఫమ్‌ చేసిన మాష్టర్‌

By:  Tupaki Desk   |   27 Aug 2015 4:58 AM GMT
ఎన్టీఆర్‌ టైటిల్‌ కన్ఫమ్‌ చేసిన మాష్టర్‌
X
ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలోని సినిమా లండన్‌ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ చిత్రంలో కథానాయిక. 'నాన్నకు ప్రేమతో' అనేది వర్కింగ్‌ టైటిల్‌ గా నిర్ణయించారు. అయితే ఇదే అధికారికమా? కాదా? అన్నది ఇంతవరకూ దర్శకనిర్మాతలు చెప్పనేలేదు. అయితే ఈ సినిమాకి స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ గా పనిచేస్తున్న పీటర్‌ హెయిన్స్‌ టైటిల్‌ ని కన్ఫమ్‌ చేశారు. 'నాన్నకు ప్రేమతో' సెట్స్‌ నుంచి అంటూ ఆయన ట్విట్టర్‌ లో ఓ అధికారిక పోస్టింగ్‌ పెట్టారు.

సౌత్‌ సినిమాకి పీటర్‌ హెయిన్‌ బ్యాక్‌ బోన్‌ లాంటోడు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ సినిమాలెన్నిటికో ఆయన ఫైట్స్‌ అందించారు. ఘర్షణ - చత్రపతి - అతడు - మగధీర - ఖలేజా - అత్తారింటికి దారేది - బాహుబలి.. ఇన్ని విజయవంతమైన సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. విజయ్‌ మాష్టర్‌, రామ్‌ -లక్ష్మణ్‌, శేఖర్‌ మాష్టర్‌, విజయన్‌ మాష్టర్‌ ఇంతమంది ఉన్నా పీటర్‌ హెయిన్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ టాప్‌ డైరెక్టర్స్‌ తో ముందుకు సాగుతున్నాడు.

ఎన్టీఆర్‌ సినిమాకి సుకుమార్‌ ఎలాంటి టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారు? అన్నది ముందే అర్థమైపోయింది. యాక్షన్‌ డ్రామా అయినా అందులో కుటుంబ ఎమోషన్స్‌ ని జోడించి నాన్నకు ప్రేమతో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సాఫ్ట్‌ టైటిల్‌ తో ఫ్యామిలీ ఆడియెన్‌ ని థియేటర్లకు రప్పించాలన్నది సుక్కూ ప్లాన్‌. జగడం, 1నేనొక్కడినే చిత్రాల్లో చేసిన తప్పుల్ని రిపీట్‌ చేయకుండా ఎంతో జాగ్రత్తగా తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుక్కూ.