Begin typing your search above and press return to search.
‘మగధీర’ టైంలో 19 ఎముకలు విరిగాయి
By: Tupaki Desk | 27 Sep 2016 9:30 AM GMTపీటర్ హెయిన్స్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు వాడు కాదు.. అసలు ఇండియనే కాదు. కానీ మన దగ్గర ఏ భారీ సినిమా మొదలైనా యాక్షన్ కొరియోగ్రఫీ కోసం అతణ్నే ఆశ్రయిస్తారు దర్శకులు. ముఖ్యంగా మగధీర.. రోబో.. ఐ.. బాహుబలి లాంటి సినిమాలతో అతడి పేరు మార్మోగిపోయింది. వియత్నాంకు చెందిన పీటర్.. ప్రస్తుతం బాహుబలి-2.. రోబో-2 లాంటి క్రేజీ ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి సినిమాలకు పని చేయడం అన్నిటికంటే కష్టమైన విషయం అని చెప్పాడు. మగధీర.. బాహుబలి సినిమాలు రెంటికీ చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు.
యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తనకు తగిలే దెబ్బల గురించి చెబుతూ.. ‘‘ఇప్పటి వరకూ నాకు గుర్తుండి నా బాడీలో 49 ఎముకలు విరిగాయి. అర్ధసెంచరీకి చేరువగా ఉన్నా. ఒక్క మగధీర సినిమా షూటింగ్ టైంలోనే 19 ఎముకలు విరిగాయి. ఐతే నాలోని క్రేజీ ఫైట్ మాస్టర్ ఇవన్నీ పట్టించుకోడు’’ అని పీటర్ హెయిన్స్ చెప్పాడు. కొరియోగ్రాఫర్ గా ఇంత పేరు సంపాదించిన పీటర్ కు అసలు ఫైట్లంటే నచ్చవట. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సమ్ హాయ్’ సినిమాలో అసలు ఫైట్లే ఉండవని అతను వెల్లడించాడు. ‘‘నేను పేరుకే యాక్షన్ కొరియోగ్రాఫర్. కానీ ఫైట్లంటే నాకు ఇష్టముండదు. అందుకే దర్శకుడిగా చేస్తోన్న తొలి సినిమా పూర్తి వైవిధ్యంగా ఉండాలని అనుకున్నాను. అలా వచ్చిన ఆలోచనతో ‘సమ్ హాయ్’ తీస్తున్నాను. నా సొంత దేశం వియత్నాంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. పీటర్ హెయిన్స్ అంటే కేవలం యాక్షన్ సినిమాలే కాదు అని చెప్పడానికి ఈ సినిమా చేస్తున్నాను. తండ్రీ బిడ్డల మధ్య అనుబంధాన్ని చెప్పే సినిమా ఇది. ఫైట్లు ఇందులో ఉండవు. పోరాట సన్నివేశాలంటే ఒక పెద్ద అబద్ధం. అందుకే నా సినిమాలో వాటి జోలికి పోను’’ అని పీటర్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/