Begin typing your search above and press return to search.
షికాగో సెక్స్ రాకెట్ హెచ్ ఆర్ సీలో పిటిషన్
By: Tupaki Desk | 25 Jun 2018 5:21 PM GMTఅమెరికాలో బయటపడిన తెలుగు సినీతారల సెక్స్ రాకెట్ కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో రహస్యంగా సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్న తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్ - అతడి భార్య చంద్రకళను ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు చోట్ల గాలింపు చేపట్టగా, షికాగో వెస్ట్ వెల్డస్ అమెన్యూలోని నిందితుల ఇంటిలో డైరీలు దొరికాయి. డైరీలో లభించిన ఆధారాలు - సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు 42 పేజీల చార్జిషీట్ ను షికాగో కోర్టులో సమర్పించారు. ఈ పరిణామంపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలైంది.
తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్ - అతడి భార్య చంద్రకళ డైరీల్లో లభించిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. భారత్ నుంచి వచ్చిన తారలు - వారు బసచేసే హోటళ్ల వివరాలు - వ్యభిచారానికి సంబంధించిన ఒప్పంద సమాచారం, వారికి డబ్బులిచ్చిన వివరాలు డైరీల్లో రాసి ఉన్నట్టు తెలిసింది. షికాగో - డల్లాస్ - న్యూజెర్సీ - వాషింగ్టన్ తదితర నగరాల్లోని హోటళ్లలో క్లయింట్ల దగ్గరికి పంపేవారని తేలింది. విషయం ఎక్కడైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తారలను హెచ్చరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా వ్యభిచారం చేసిన తారలు - విటులను ఫెడరల్ పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ పై న్యాయవాది అరుణ్ హెచ్ ఆర్ సీలో పిటిషన్ దాఖలు చేశారు. సెక్స్ రాకెట్ లో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నందున సమాజంపై అది ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషన్ లో తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - డీజీపీలను ఆదేశించాలని కోరారు. షికాగో సెక్స్ రాకెట్ లాంటి వ్యవహారాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని న్యాయవాది అరుణ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.