Begin typing your search above and press return to search.
తలైవికి ఆదిలోనే హంసపాదు.. ప్రమోషన్లు ఆపాలని పిటిషన్
By: Tupaki Desk | 28 March 2021 4:30 AM GMTమేటి కథానాయిక.. మాజీ తమిళనాడు సీఎం జె.జయలలితపై బయోపిక్ కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. `తలైవి` థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే రిలీజై తమిళనాట తీవ్ర చర్చకు తెర తీసింది. అయితే తలైవి ప్రమోషన్స్ ని ఆపాలని కోర్టులో పెటిషన్ వేయడం వేడెక్కిస్తోంది. అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులో తలైవి డ్రమటిక్ ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి సమయంలో తలైవిని ఆపాలని ఒక ప్రముఖ న్యాయవాది భారత ఎన్నికల కమిషన్ కి పిటిషన్ లో నివేదించారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు ఏదైనా `ప్రచార సామగ్రి`ని ప్రదర్శించరాదని దానిని ఆపాలని పిటిషన్ లో కోరారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ప్రచార మెటీరియల్ ని వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఫిలింమేకర్స్ ను ప్రమోటర్లను ఆదేశించాలని న్యాయవాది కోరారు.
చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చలన చిత్రానికి సంబంధించి రోడ్ షోలు లేదా భౌతిక ప్రచార కార్యక్రమాలను అనుమతించవద్దని న్యాయవాది కోరారు. కంగనా రనౌత్- అరవింద స్వామి- మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన తలైవి ఏప్రిల్ 23 న థియేటర్లలో విడుదల కానుంది. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో విబ్రీ మీడియా - కర్మ మీడియా ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.