Begin typing your search above and press return to search.

థియేట‌ర్ మాఫియాని షూట్ చేయాలి!

By:  Tupaki Desk   |   6 Jan 2019 6:17 PM GMT
థియేట‌ర్ మాఫియాని షూట్ చేయాలి!
X
టాలీవుడ్ లో థియేట‌ర్ల మాఫియా ఆల్వేస్ హాట్ టాపిక్. ఇండ‌స్ట్రీలో ఆ న‌లుగురు గుప్పిట్లో థియేట‌ర్లు ఉన్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. థియేట‌ర్ల‌ను గుప్పిట ప‌ట్టి ఆటాడిస్తార‌ని, ఈ ఆట‌లో అందరూ పావులుగా మారాల్సిందేన‌ని ఇప్ప‌టికే ఎంద‌రో నిర్మాత‌లు ప‌బ్లిక్ ప్లాట్‌ ఫామ్‌ పైనే గ్యాలెన్ల కొద్దీ క‌న్నీళ్లు కార్చారు. అవి ఆవిరైపోయి చాలా కాల‌మే అయ్యింది. అయితే ఈ జాబితాలో వేరొక నిర్మాత చేరారు. ఆయ‌నే ర‌జ‌నీ `పేట` చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న అశోక్ వ‌ల్ల‌భ‌నేని.

ఈ సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న స్ట్రెయిట్ తెలుగు సినిమాల‌తో పోటీప‌డి ర‌జ‌నీ `పేట` ను రిలీజ్ చేస్తున్నారాయ‌న‌. అయితే థియేట‌ర్ల ద‌గ్గ‌ర చికాకులు స‌ద‌రు నిర్మాత‌కు త‌ల బొప్పి క‌ట్టించాయి. పేట‌ సినిమాకి థియేట‌ర్లు ఇవ్వ‌కుండా భ‌ల్లూకాల్లా ఇటూ అటూ న‌లిపేస్తున్నార‌ని ఇప్ప‌టికే ఎన్నో క‌థ‌నాలొచ్చాయి. క‌థానాయ‌కుడు, విన‌య విధేయ రామ‌, ఎఫ్ 2 చిత్రాల‌తో పోటీప‌డుతున్న ఈ సినిమాకి థియేట‌ర్లు లేనేలేవ‌ని నేరుగా నిర్మాత‌నే ఎంతో వాపోయారు. దీంతో పేట నిర్మాత అశోక్ తీవ్ర‌మైన ఆవేద‌న న‌డుమ ఆదివారం సాయంత్రం జ‌రిగిన `పేట‌` ప్రీరిలీజ్ వేడుక‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

నా సినిమాని థియేట‌ర్లు ఇవ్వ‌కుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. యువి క్రియేష‌న్స్, అల్లు అర‌వింద్, దిల్ రాజు.. వీళ్లంతా థియేట‌ర్లతోనే పుట్టిన‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. పేట చిత్రానికి థియేట‌ర్లు ఇవ్వ‌డానికి వీళ్ల‌కు నొప్పేంటి? వ‌ంద‌లాది థియేట‌ర్ల‌లో ఒకే సినిమాని వేసి మంచి సినిమా వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వ‌కుండా నాట‌క‌మాడ‌తారా? .. వీళ్లు వేసే సినిమాలే చూడాలా? వీళ్లు రుద్దేసేవే చూడాలా? ఈ కుక్క‌ల‌కు బుద్ధి చెబుదాం.. అంటూ ఫైర‌య్యారు. కేసీఆర్, చంద్ర‌బాబు ఇలాంటి వాళ్ల‌ను అణ‌చివేయాల‌ని ఘాటుగా వ్యాఖ్యానించారు. అశోక్ వ‌ల్ల‌భ‌నేని మాట్లాడుతూ-``కేసీఆర్ ప్ర‌జాభిమానంతో మ‌ళ్లీ గెలిచి సీఎం అయ్యారు. ఎవ‌రినో న‌యీమ్‌ని చంపారు. థియేట‌ర్ల మాఫియాని ఎందుకు షూట్ చేయ‌రు? అని సూటిగా ప్ర‌శ్నించారు. కేసీఆర్, చంద్ర‌బాబు ఇలాంటి వాళ్ల‌ను తొక్కాలి.. అని వ్యాఖ్యానించారు. వంద‌లాది థియేట‌ర్ల‌లో ఒకే సినిమాని వేసి చిన్న సినిమాల్ని చంపేస్తున్నార‌ని అన్నారు. మిగ‌తా సినిమాల‌ను.. నేను రిలీజ్ చేస్తున్న పేట‌ సినిమాకు పోలిస్తే ఎంత నీచంగా ఉందీ ప‌రిస్థితి.. అని వాపోయారు అశోక్