Begin typing your search above and press return to search.

#ప‌ఠాన్‌.. హిందువులేనా ముస్లిములు మీద ప‌డ్డారు!

By:  Tupaki Desk   |   17 Dec 2022 3:45 AM GMT
#ప‌ఠాన్‌.. హిందువులేనా ముస్లిములు మీద ప‌డ్డారు!
X
షారూఖ్ ఖాన్ ప‌టాన్ విడుద‌ల‌కు ముందు ర‌క‌ర‌కాల‌ వివాదాల్లో న‌లుగుతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవ‌ల ఖాన్- దీపిక జంట‌పై తెర‌కెక్కించిన స్టీమీ బీచ్ సాంగ్ 'బేషరమ్ రంగ్'లో అభ్యంతరకరమైన దుస్తులు ధ‌రించార‌ని బోల్డ్ సన్నివేశాల్లో న‌టించిన‌ షారూఖ్ ఖాన్-దీపికా పదుకొణెలపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి పిలుపునిచ్చారు. ఈ సినిమాను బహిష్కరించాలి లేదా నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ డిమాండ్ చేశారు.

షారూఖ్ ఖాన్ జీరో త‌ర‌వాత‌ ఐదేళ్ల కు థియేటర్లలో తన మొదటి విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. పఠాన్ లో అత‌డు గూఢచారి పాత్రలో నటించాడు. అయితే పూర్తి స్థాయి ట్రైలర్ విడుదల కాకముందే వివాదాల్లో కూరుకుపోయింది. మొదటి పాట 'బేషరమ్ రంగ్' హెడ్ లైన్స్ లో నిలిచింది. ఈ పాట కోసం దీపికా పదుకొణె వ‌స్త్ర‌ధార‌ణ‌పై ప‌లువురు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.

ఈ పాటను స్పెయిన్ బీచ్ లలో చిత్రీకరించారు. అక్కడ నటి స్విమ్ సూట్ లో ఉంది. స్త్రీలు ఏవి ధరించాలి ఏవి ధరించకూదో దుస్తులపై నెటిజన్లు స్త్రీద్వేషపూరిత ప్రొప‌గండా చేసినా కానీ.. కొంద‌రు ఈ చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నాయి. సినిమాను బహిష్కరించాలని లేదా నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ డిమాండ్ చేశారు.

#షారూఖ్ ఖాన్ పఠాన్: 'బేషరం రంగ్'లో అభ్యంతరకరమైన దుస్తులు మరియు బోల్డ్ సన్నివేశాల కోసం షారుఖ్ ఖాన్-దీపికా పదుకొనేలపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి పిలుపునిచ్చారు.

బేషరమ్ రంగ్ లో దీపికా పదుకొణె కాస్ట్యూమ్స్‌ అదరగొట్టారు. బన్సాల్ ట్విటర్ లో ఇలా వ్రాస్తూ, "ఇస్లాంను విశ్వసించే పఠాన్ ముస్లిం చిహ్నాలతో ఇటువంటి సన్నివేశాలను చిత్రీకరించగలరా!! లవ్ జిహాదీల అసంబద్ధతకు హద్దు ఉంటుంది!!" అని కూడా వ్యాఖ్యానించారు.

హిందూ మహిళ కాషాయ దుస్తులు ధరించి ఇస్లామిక్ జిహాదీల కీలుబొమ్మగా మారడం ఎంత బోల్డ్ సీన్? దేశద్రోహానికి కూడా హద్దు ఉంటుంది! బాలీవుడ్ పరువు తీయడం ద్వారా ఈ సోదరులను తుక్డే తుక్డే గ్యాంగ్ ను హిందూ సమాజం ఇకపై సహించదు.

సినిమాను ప్రదర్శించే థియేటర్లకు నిప్పు పెట్టాలని అయోధ్యకు చెందిన హనుమాన్ గార్హి రాజు దాస్ మహంత్ పిలుపునిచ్చారు. ఇది మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా 'బేషరమ్ రంగ్'లో అభ్యంతరకరమైన దుస్తులపై అభ్యంత‌రాల‌ను లేవనెత్తిన తర్వాత హిందుత్వను అవమానించే చిత్రాన్ని సహించేది లేదని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు.

ఇటీవ‌లే షారుఖ్ ఖాన్ 28వ కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో ద్వేషపూరిత ప్ర‌చారాల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. నటుడు మాట్లాడుతూ, - "మన కాలంలో సామూహిక కథనాలైన సోషల్ మీడియా ద్వారా రూపొందించిన‌ది. సోషల్ మీడియా సినిమాపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న నమ్మకానికి విరుద్ధంగా ఇప్పుడు సినిమా మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను నమ్ముతున్నాను" అన్నారు.

SRK ఇలా అన్నారు, -"సోషల్ మీడియా తరచుగా ఒక నిర్దిష్ట సంకుచిత దృక్పథంతో నడుస్తుంది. అది మానవ స్వభావంలో నీచమైన స్థితిని తెలియేస్తుంది. ప్రతికూలత వల్ల సోషల్ మీడియా వినియోగం పెరుగుతుందని తద్వారా దాని వాణిజ్య విలువ కూడా పెరుగుతుందని ఎక్కడో చదివాను. అలాంటి అన్వేషణలు సామూహిక కథనాన్ని చుట్టుముట్టాయి. ఈ త‌రహ‌ విభజన విధ్వంసకరం చేస్తుంది.. అని అనాడు.

పఠాన్ ఆదిత్య చోప్రా యొక్క ప్రతిష్టాత్మక గూఢచారి విశ్వంలో భాగం. దేశంలోని అతిపెద్ద సూపర్ స్టార్‌లు షారూఖ్ ఖాన్- దీపికా పదుకొనే -జాన్ అబ్రహం ఇందులో ఉన్నారు. ఈ చిత్రం జనవరి 25న‌ హిందీ- తమిళం - తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఇప్పుడు పఠాన్‌ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని ముస్లిం బోర్డు ఆరోపిస్తోంది. సినిమా విడుదలను నిలిపివేస్తామని ఎంపీ ఉలేమా బోర్డు బెదిరించింది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విశ్వహిందూ పరిషత్ (VHP) నుండి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ముస్లిముల దాడులు పెరిగాయి.

వీహెచ్ పి పార్టీ త‌ర్వాత‌ పఠాన్ పై అభ్యంతరం చెప్పడం ఇప్పుడు ముస్లిం మత బోర్డు వంతు అయింది. ఈ చిత్రం కేవలం పఠాన్ ల మతపరమైన మనోభావాలను మాత్రమే కాకుండా మొత్తం ముస్లిం సమాజాన్ని దెబ్బతీసేలా ఉందని మధ్యప్రదేశ్ ఉలేమా బోర్డు ఆరోపించింది. ఇప్పుడు పఠాన్‌ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాడని ముస్లిం బోర్డు ఆరోపిస్తోంది. సినిమా విడుదలను నిలిపివేస్తామని ఎంపీ ఉలేమా బోర్డు బెదిరించింది.

ఎంపీ ఉలేమా బోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనాస్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, -“పఠాన్లు అత్యంత గౌరవనీయమైన ముస్లిం సమాజాలలో ఒక కేట‌గిరీ. పఠాన్ లు మాత్రమే కాదు.. మొత్తం ముస్లిం సమాజం వారికి అండగా ఉంది" అని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.