Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అందం రేంజ్ 180 డిగ్రీలు

By:  Tupaki Desk   |   30 Jan 2021 12:30 AM GMT
ఫోటో స్టోరి: అందం రేంజ్ 180 డిగ్రీలు
X
ఇన్ స్టా మాధ్య‌మంలో స‌డెన్ స్టార్ లా దూసుకొచ్చిన ముద్దుగుమ్మ సాక్షి మాలిక్. ఈ మాధ్య‌మంలో 50ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంది. నిరంత‌రం సాక్షి హాట్ ఫోటోషూట్ల‌తో వైర‌ల్ గా మారుతోంది. ఇటీవ‌ల‌ మాల్దీవుల విహారంలో వ‌రుస బికినీ షూట్ల‌తో అగ్గి రాజేసిన ఈ బ్యూటీ .. తన కాబోయే భర్తతో దిగిన‌ వేడెక్కించే ఫోటోని షేర్ చేసింది.

`సోను కే టిటు కి స్వీటీ` చిత్రం నుండి వచ్చిన `బోమ్ డిగ్గీ డిగ్గీ` పాటలో సాక్షి మాలిక్ ట్రీట్ ని ఫ్యాన్స్ అస్స‌లు మ‌రువ‌నేలేరు. అప్పటి నుండి ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటోంది.సాక్షి తాజాగా మ‌రోసారి అదిరిపోయే భంగిమ‌ను ఇన్ స్టాలో షేర్ చేసింది. సాక్షి ఓ స్పెష‌ల్ వ‌ర్క‌వుట్ పై టిప్స్ ని అందించింది. ఇది గుడ్ బాయ్ మ‌ఫిన్ టాప్ వ‌ర్క‌వుట్. ఈ సందర్భంగా సాక్షి భంగిమ‌ బోయ్స్ వాట్సాపుల్లో వైర‌ల్ గా మారింది.

ఇక ఈ వ‌ర్క‌వుట్ టిప్ ని ప‌రిశీలిస్తే.. 1 నిమిషం సైడ్ ప్లాంక్ లెఫ్ట్.. 1 నిమిషం సైడ్ ప్లాంక్ రైట్.. 20 సైడ్ క్రంచెస్ లెఫ్ట్.. 20 సైడ్ క్రంచెస్ రైట్.. 1 నిమిషం ప్లాంక్ హోల్డ్. ఇలా మూడు సెట్లు గా చేయాలి. వారంలో మూడు సార్లు చేయాలి. 14రోజుల్లోనే కొవ్వు క‌రిగి మంట‌లు పెట్టే డిఫ‌రెన్స్ చూస్తారు! అంటూ ఈమోజీని షేర్ చేసింది సాక్షి.