Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బీస్ట్ లా మారిన బ్యూటీ.. పరుగులే ఇక!
By: Tupaki Desk | 19 March 2021 3:30 PM GMTనటి కం మోడల్ షామా సికందర్ పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న ఈ బ్యూటీ సహాయక పాత్రల్లో నటిస్తూ అలాగే బుల్లితెరపైనా వెలుగులు ప్రసరిస్తోంది.
గత కొంతకాలంగా షామా వైఖరి చూస్తుంటే.. ఈ అమ్మడు పెద్ద స్టార్ డమ్ ని అందుకోవాలన్న తపనతో దూసుకొస్తోందని అర్థమవుతోంది. అటు హిందీ చలనచిత్ర పరిశ్రమతో పాటు కోలీవుడ్ టాలీవుడ్ లోనూ అవకాశాల కోసం షామా సీరియస్ గా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
తాజాగా షామా వేడెక్కించే ఫోటోలతో మరోమారు ఇన్ స్టా ట్విట్టర్ లో విరుచుకుపడింది. ఈ ఫోటోలకు అంతే హాటెస్ట్ కామెంట్లను జోడించింది. కొన్నిసార్లు బ్యూటీ అండ్ బీస్ట్ గా మారాలి.. అన్న వ్యాఖ్యను షామా తాజా ఫోటోగ్రాఫ్ కి జోడించంది. నిఖిల్ పి సావంత్ - దియా బృందం మేకప్ ఫోటోగ్రఫీలో ప్రతిభను కనబరిచారని షామా వెల్లడించింది. నా ముఖంలో నీకు నచ్చే ఫీచర్ ఏది? అంటూ ఇంతకుముందు ఫ్యాన్స్ ని ప్రశ్నించింది ఈ అమ్మడు. దానికి ట్విట్టర్ లో అద్భుత స్పందన వచ్చింది.
మాయ అనే లఘు చిత్రంలో నటించిన షామా ఇటీవల `యే మేరీ లైఫ్ హై` పాత్రలో తన పాత్రకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాదితో షామా సికందర్ కు 39 ఏళ్లు. టీవీ షో యే మేరీ లైఫ్ హై (2003-2005)లో పూజా మెహతా పాత్రలో పాపులరైంది. అమీర్ ఖాన్ `మన్ అండ్ ప్రేమ్ అగ్గన్` లలో కూడా కనిపించింది. వరుస సినిమాల్లో నటిస్తూనే.. ఆమె తన షార్ట్ ఫిల్మ్ `సెక్సాహోలిక్`.. `మాయా: స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్`తో దుమారం రేపింది. షామా నిర్మాత గానూ మారింది. షామా సికందర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన సొంత సంస్థను రన్ చేస్తోంది. ఇందులో షామా `అబ్ దిల్ కి సన్` అనే షార్ట్ మూవీ సిరీస్ ను నిర్మించింది. ఆరోగ్యం కాపాడుకోవడంపైనా వీడియోల్ని ఈ వేదికపై షేర్ చేస్తోంది.