Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: భాగ్య‌ల‌క్ష్మి పిచ్చి పీక్స్ గురూ

By:  Tupaki Desk   |   31 March 2022 5:30 AM GMT
ఫోటో స్టోరి: భాగ్య‌ల‌క్ష్మి పిచ్చి పీక్స్ గురూ
X
శ్రుతి హాస‌న్ పిచ్చి పీక్స్ వ్య‌వ‌హారం తెలియ‌న‌ది కాదు. ఈ బ్యూటీ పూర్తిగా పాశ్చాత్య ధోర‌ణితో వెరైటీ ఫ్యాష‌నిస్టాగా పాపుల‌రైంది. గోథిక్ మేక‌ప్ విధానాల‌ను భార‌తీయ సెల‌బ్రిటీ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది శ్రుతినే. కంగ‌న త‌ర‌హా మెంట‌ల్ హై క్యా త‌రహా యాటిట్యూడ్ శ్రుతిలో శ్రుతిమించింద‌ని కూడా కామెంట్లు వినిపించాయి. ఇక ప్రియుడు శంత‌నుతో ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారంపైనా అభిమానులు నిరంత‌రం వేడెక్కించే కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా శ్రుతిహాస‌న్ షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇది డిఫ‌రెంట్ లుక్.. శ్రుతి లుక్ ఆహార్యం ప్ర‌తిదీ వెరైటీనే. అయితే శ్రుతి మేక‌ప్ విధానం షేడెడ్ స్టైల్ ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అలా టాప్ యాంగిల్ లో జూమ్ చేస్తే శ్రుతిలో హాట్ కంటెంట్ మ‌రో లెవ‌ల్లో ఆవిష్కృత‌మైంది. ఆ పింక్ లిప్స్ తో ఒక్క లిప్ లాక్ ప్లీజ్! అంటూ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రోవైపు శ్రుతి హాసన్ కి పెళ్లయింది అంటూ ప్ర‌చారం సాగుతోంది. శంత‌న్ జీ.. మీరు ఓపెన్ మైండెడ్ బాయ్‌ఫ్రెండ్! అంటూ అభిమానులు ఖంగుతిన‌డం షాకిస్తోంది. శృతి హాసన్ బాయ్‌ఫ్రెండ్ శంత‌ను ఇటీవ‌ల ఫ్యాన్స్ ని టీజ్ చేస్తూ ఓ కామెంట్ చేశాడు. "మాకు ఇదివరకే పెళ్లైంది.. శృతి హాసన్ తో.."అని అన్నాడు. శ్రుతితో తనకున్న సంబంధం గురించి శంత‌ను హజారికా చాలా చెప్పాడు. శృతిహాసన్ ప్రస్తుతం ముంబైలో శంత‌నుతో స‌హ‌జీవ‌నంలో ఉంది. ఆమె 2020 నుండి త‌న‌తో డేటింగ్ చేస్తోంది. ఈ జంట‌ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

లండన్ కు చెందిన మైఖేల్ కార్సెల్ తో ప్రేమలో పడి విడిపోయాక శ్రుతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డానని శృతి వెల్లడించింది. శంతను ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్. 2014 డూడుల్ ఆర్ట్ పోటీలో `ఉత్తమ డూడుల్ ఆర్టిస్ట్‌`గా ఎంపికయ్యాడు. అదే స‌మ‌యంలో అత‌డికి శ్రుతి స‌న్నిహితురాలైంది.

ఇటీవలి ఇంటర్వ్యూలో,.. శృతి హాసన్‌తో ఉన్న సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మీరు ప్లాన్ చేస్తున్నారా అని రిపోర్టర్లు శంతనుని ప్రశ్నించారు. శంతను సమాధానమిస్తూ.. మేము ఇప్పటికే సృజనాత్మకంగా వివాహం చేసుకున్నాము. మా బంధం చాలా దృఢమైనది. అందుకు నిదర్శనం మన ఇండస్ట్రీలో చేస్తున్న వినూత్న పనులను ప‌రిశీలించండి.

వెరైటీగా మ‌ళ్లీ మళ్లీ చేయడంలో మా ఇద్దరికీ ఆసక్తి ఎక్కువ. ఎల్లప్పుడూ మా ఇద్దరికీ వినూత్న ఆలోచనా ధోర‌ణి చాలా ముఖ్యమైన విషయం. అయితే పెళ్లి గురించి పెద్దగా ఏమీ తెలియదు. కాబట్టి మునుముందు చూద్దాం.. అంటూ మాట దాట‌వేశాడు. పెళ్లి కంటే క‌లిసి జీవించ‌డం ముఖ్యం అనేది అత‌డి ఉద్ధేశం.