Begin typing your search above and press return to search.
ఫొటో స్టోరీ: ఎవరీ పోనీటైల్ స్టార్?
By: Tupaki Desk | 29 July 2022 9:39 AM GMTబ్లాక్ అండ్ వైట్ లో వున్న ఓ ఫొటో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోని త్రీ పార్ట్స్ గా విడదీసి నెట్టింట షేర్ చేశారు. బ్లాక్ జాకెట్ చెవులకు రింగులు.. కర్లింగ్ హెయిర్ డిజైన్. వెనకాల పోనీటైల్ ఎడ్జ్ కి రింగ్.. వెరసి అల్ట్రా స్టైలిష్ మేకోవర్ తో కనిపిస్తున్న పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇంతకీ ఈ పోనీటైల్ స్టార్ ఎవరు? ఏమాకథ అని ఆరాతీస్తే షాకింగ్ విషయం బయటపడింది. కర్లింగ్ హెయిర్ డిజైన్. వెనకాల పోనీటైల్ ఎడ్జ్ కి రింగ్.. అల్ట్రా స్టైలిష్ మేకోవర్ తో కనిపిస్తున్నది మరెవరో కాదండోయ్ మన స్టైలిష్ స్టార్ పుష్పరాజ్.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ లో స్టైల్స్ కి ఐకాన్ గా నిలిచిన హీరో అల్లు అర్జున్. సిక్స్ ప్యాక్ నుంచి ప్రతీ స్టైల్ ని టాలీవుడ్ కు పరిచయం చేయడంతో ముందు వరుసలో నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ఇలా స్టైల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా బన్నీ నిలిచారు కాబట్టే ఆయనకు స్టైలిష్ స్టార్ అనే పేరొచ్చింది. ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఫ్యాన్స్ ముద్దుగా బన్నీని స్టైలిష్ స్టార్ అంటూ పిలుకుంటుంన్న విషయం తెలిసిందే.
`పుష్ప`లో తన పంథాకు పూర్తి భిన్నంగా నటించి పుష్పరాజ్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న బన్నీ త్వరలో ప్రారంభం కానున్న `పుష్ప` సీక్వెల్ కోసం రెడీ అయిపోతున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. పార్ట్ 1 కి మించిన బడ్జెట్ తో అత్యంత భారీ స్థాయిలో `పుష్ప 2`ను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇంతు కోసం ఫైనల్ స్క్రిప్ట్ పై దర్శకుడు సుకుమార్ గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్నారు.
ఇదిలా వుంటే `పుష్ప` క్రేజ్ కారణంగా డిమాండ్ పెరగడంతో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తున్నారు. ఇప్నటికే రాపిడో, రెడ్ బస్, జొమాటో, ఫ్రూటీ, కోల్గెట్ ఫ్రెష్ వంటి యాడ్ లలో నటించారు. `పుష్ప2` షూటింగ్ కి ఇంకా టైమ్ వుండటంతో తాజాగా మరో కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దీనిని డైరెక్ట్ చేస్తున్నారు. స్టైల్స్ కి ఐకాన్ గా మారిన బన్నీ ఈ యాడ్ లో మరింత కొత్తగా నెవర్ బిఫోర్ అవతార్ లో చాలా స్పెషల్ లుక్ లో కనిపించాలని ట్రై చేస్తున్నారు.
ఈ యాడ్ లో బన్నీకి లుక్ కు సంబంధించిన ప్రీ లుక్ బీటీఎస్ ఫొటోలని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో వున్న ఈ ఫొటోల్లో బన్నీ కర్లింగ్ హెయిర్‌తో డిఫరెంట్ మేకోవర్ తో చెవులకు పోగులు.. పోనీటైల్ .. దానికి చివరన పోగుతో కనిపిస్తున్న తీరు చాలా స్టైలిష్ గా వుంది.
ఫుల్ ఫేస్ ఫొటోల్లో కనిపించడం లేదు కానీ లుక్ మాత్రం చాలా స్టైలిష్ గా కొత్తగా వుంటుందని తెలుస్తోంది. బన్నీ పూర్తి లుక్ ని చూడాలంటే హరీష్ శంకర్ షూట్ చేస్తున్న కమర్షియల్ యాడ్ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.