Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: గ్లామర్ అండ్ స్టైల్ రాక్స్

By:  Tupaki Desk   |   4 Dec 2019 2:37 PM GMT
ఫోటో స్టోరీ: గ్లామర్ అండ్ స్టైల్ రాక్స్
X
హాటు భామలను ఫాలో అయ్యేవారికి సోఫీ చౌదరి పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ భామ మహేష్ బాబు '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. నిన్న ముంబైలో ఫిలిం ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ లోని సుందరాంగులు అందరూ తెగ వయ్యారంగా రెడీ అయి వచ్చారు. వారిలో ఈ సోఫీ కూడా ఉంది.

గ్లామర్ ఈవెంట్ కు అత్యంత గ్లామరస్ గా రెడీ అయి మరీ హాజరైంది కాబట్టి ఆ డ్రెస్ లోనే ఫోటో షూట్ కూడా చేసింది. సదరు ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు "ఒక దృశ్యంలాగా ఫీలవుతున్నాను. #ఫిలింఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటో విషయానికి వస్తే ఒక పొడవాటి తెలుపు రంగు గౌన్ లో హాటు యువరాణిలాగా మెరిసింది. ఇలాంటి డ్రెస్సులకు డీప్ వీనెక్.. థై స్లిట్ లేకపోతే మరీ ఎర్రబస్సు అనుకుంటారని సోఫీకి మనకంటే చక్కగా తెలుసు కాబట్టి అలాంటి డ్రెస్సే ధరించింది. మెడలో ఒక సన్నటి చెయిన్ ధరించి.. చేతి వేళ్ళకు ఉంగరాలు ధరించి నడుముపై చేతులు పెట్టుకుని పైకి చూస్తూ ఒక కాన్ఫిడెంట్ పోజిచ్చింది. బ్రౌన్ కలర్ లిప్ స్టిక్.. బ్లీచ్ చేసిన హెయిర్ కావడంతో స్టైల్ ఫ్యాక్టర్ మరింతగా పెరిగింది.

ఈ గ్లామరసం ఫోటోలకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లోని మరో గ్లామర్ ఘటికురాలు ఈషా గుప్తా "లవ్" అంటూ కామెంట్ చేసింది. వరుణ్ ధావన్ లాంటి కొందరు బాలీవుడ్ హీరోలు ఈ ఫోటోలకు ఓ లైక్ వేసుకున్నారు. "స్టన్నింగ్ డ్రెస్".. "హాట్ ఏంజెల్".. "గ్లామర్ అండ్ స్టైల్ రాక్స్" అంటూ కొందరు సాధారణ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.