Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: సిల్లీ ఫెలోస్ బ్యూటీ సెక్సీ లుక్

By:  Tupaki Desk   |   13 March 2020 9:15 AM GMT
ఫోటో స్టోరీ: సిల్లీ ఫెలోస్ బ్యూటీ సెక్సీ లుక్
X
టాలీవుడ్ లో ఉన్న తక్కువమంది హాటు భామల్లో నందిని రాయ్ ఒకరు. ఈ హైదరాబాద్ అమ్మాయి 2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ ను గెలుచుకుంది. మోడల్ గా ఎన్నో యాడ్స్ లో కనిపించింది. తర్వాతే సినిమాల్లో హీరోయిన్ గా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. 'మాయ'.. 'మోసగాళ్ళకు మోసగాడు'.. 'సిల్లీ ఫెలోస్' లాంటి సినిమాల్లో నటించింది. అయితే ఈ భామకు ఇంకా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. ఈ భామ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ 2 తెలుగు లో కూడా పాల్గొంది.

ఈ తరం భామల తరహాలోనే నందిని రాయ్ సోషల్ మీడియాను షేక్ చేయడంలో స్పెషలిస్టు. ఈ భామకు ఇన్స్టా ఖాతాలో 370k ఫాలోయర్లు ఉన్నారు. వారిని మురిపించేందుకు నందిని రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ పోస్ట్ చేస్తూ హీటు పెంచే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసి "యాటిట్యూడ్ మేక్స్ ది డిఫరెన్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఓ నిచ్చెన దగ్గర నిలుచుని దానిపై ఒక కాలు పెట్టి సూపర్ మోడల్ తరహాలో పోజులిచ్చింది. షర్టు ను చేత్తో పట్టుకుని.. ఇన్నర్ వేర్ తో అందాలను వడ్డించింది. స్టైలిష్ ప్యాంట్ ధరించి.. బ్లాక్ కలర్ హీల్స్ తో మోడరన్ గా కనిపించింది. కూలింగ్ గ్లాసెస్ తో ఈ భామ ఫుల్ ఓ సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ భామ హాట్ నెస్ బాలీవుడ్ బ్యూటీల ఘాటుకు ఏమాత్రం తీసిపోదు.

ఈ భామ ఫోటోలకు అందుకే భారీ రెస్పాన్స్ దక్కింది. "సమ్మర్ అని షర్టు వేసుకోలేదా?".. "వెరీ హాట్ యాటిట్యూడ్".. "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక నందిని రాయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో ఆఫర్లు లేవు.