Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సిరి మ‌ల్లె పువ్వు అందం

By:  Tupaki Desk   |   6 Nov 2019 11:00 AM GMT
ఫోటో స్టోరి: సిరి మ‌ల్లె పువ్వు అందం
X
సిరి మల్లె పువ్వా..
సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడూ ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరి మల్లె పువ్వా ..

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడేన్నాళ్ళ కోస్తాడో

సిరి మ‌ల్లె పువ్వు అందం అన‌గానే శ్రీ‌దేవి గుర్తుకు రావాల్సిందే. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప‌ద‌హారాళ్ల వ‌య‌సు సినిమా ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని క్లాసిక్ గా నిలిచింది అంటే ఆ సినిమాలో శ్రీ‌దేవిని ఎంత అందంగా చూపించారో గుర్తుకు తెచ్చుకోవాల్సిందే. సిరిమ‌ల్లె పువ్వా టైటిల్ సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. నాటి యువ‌హృద‌యాల్ని కొల్ల‌గొట్టిన ఈ పాట‌కు కె.చ‌క్ర‌వ‌ర్తి అద్భుత‌మైన సంగీతం అందించారు.

చాలా కాలానికి శ్రీ‌దేవి వార‌సురాలు.. జాన్వీ కొంచెం నిండైన దుస్తుల్లో క‌నిపించింది. నిరంత‌రం చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌తో కుర్ర‌కారు కంటికి కునుకు అన్న‌దే ప‌ట్ట‌నివ్వ‌ని ఈ అమ్మ‌డు టాప్ టు బాట‌మ్ వైట్ ఫ్రాకులో క‌నిపించి మురిపించింది. పొట్టి నిక్క‌ర్ల‌తో పోలిస్తే ఇదే నిండుత‌నం అనిపిస్తోంది మ‌రి! అప్ప‌డ‌ప్పుడు మార్పు కోస‌మే ఈ సాహ‌సం అనుకోవాల్సిన ప‌రిస్థితి.. ప్చ్!!