Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: సాయం సంధ్యలో విరహమేల
By: Tupaki Desk | 22 Jan 2020 8:58 AM GMT`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` సీక్వెల్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది తారా సుతారియా. అరంగేట్రమే అందాల ఆరబోతతో యువతరానికి మత్తెక్కించింది. ఆ తర్వాత రివెంజ్ థ్రిల్లర్ మార్జావాన్ లో నటించింది. యాక్షన్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన తారా సుతారియా హొయలు హాట్ టాపిక్ గా మారాయి. తారా నిరంతర ఫోటోషూట్లు ఇటీవల కొంతకాలంగా యూత్ లో చర్చకు తావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ విరామ సమయాన్ని మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. తారా లేటెస్ట్ బికినీ ఫోటో అంతర్జాలంలో అగ్గి రాజేసింది.
ఇలా చూడటానికి ఎంత సింపుల్ గా కనిపిస్తోందో అంత కాస్ట్ లీ బికినీ ఇది. దీని ఖరీదు అక్షరాలా రూ.25000 (350 డాలర్లు). తారా సెక్సీ బ్లాక్ మోనోకిని బికినీ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫోటోషూట్ ని సంధ్యా సమయంలో ప్లాన్ చేయడంతో.. ఓ అందమైన సూర్యాస్తమయాన్ని తారా ఎంతగా ఎంజాయ్ చేస్తోందో ఈ ఫోటో చెబుతోంది.
ప్రఖ్యాత గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం పాల్గొన్న ఫోటోషూట్ నుంచి లీకైన తెరవెనక ఫోటో ఇది. ``మలైకా, నకుపెండ మలైకా`` అంటూ సామాజిక మాధ్యమంలో షేర్ చేసిన ఈ ఫోటోకు క్యాప్షన్ ని జోడించింది తారా. `ఏంజెల్.. లవ్ యు ఏంజెల్` అనేది ఈ క్యాప్షన్ మీనింగ్. ఇక తారా కెరీర్ సంగతులు పరిశీలిస్తే.. ప్రస్తుతం RX 100 రీమేక్ లో నటిస్తోంది. `తడప్` అనే టైటిల్ ని ఇటీవల ప్రకటించారు. అహన్ శెట్టి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండగా... మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు.