Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : చురకత్తుల్లాంటి చూపులతో అమ్మడి ఎటాక్..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 9:39 AM GMT
ఫోటో స్టోరీ : చురకత్తుల్లాంటి చూపులతో అమ్మడి ఎటాక్..!
X
కథానాయికల విషయంలో ట్రెండ్ మారింది. ఒకప్పుడు పెళ్లైన హీరోయిన్ సినిమాలు చేయాలంటే చాలా ఆలోచించే వారు. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఒకరిద్దరు ప్రయత్నించినా అదేదో తప్పు చేస్తున్నట్టు టార్గెట్ చేసే వారు. కానీ ఇప్పుడు పెళ్లైనా సరే హీరోలకు ఈక్వల్ గా హీరోయిన్స్ కూడా పోటీ పడుతున్నారు. సౌత్ లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది పెళ్లయిన భామలు కూడా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వీరిలో ఇప్పుడు కాజల్ కూడా చేరింది. సౌత్ స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ గౌతం కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

స్నేహితుడే భర్త అవడంతో ఆమెకు మరింత కంఫర్ట్ గా ఉంది. అందుకే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసేందుకు అతను ఎలాంటి అడ్డు చెప్పలేదు. పెళ్లి అయిన తర్వాత వెంటనే పిల్లాడికి జన్మనిచ్చిన కాజల్ రెండేళ్లు గ్యాప్ తీసుకుంది.

మళ్లీ ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. సినిమాలతో పాటుగా ఈమధ్య సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్డేట్స్ తో సత్తా చాటుతుంది కాజల్. లేటెస్ట్ గా అమ్మడు ఓ క్రేజీ ఫోటోని షేర్ చేసింది.

చురకత్తుల్లాంటి చూపులతో ఫాలోవర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కాజల్. పెళ్లై ఒక పిల్లాడికి తల్లిలా అసలు లేదని చెప్పొచ్చు. మోడ్రెన్ జాకెట్, ప్యాంట్ తో అమ్మడు డాషింగ్ లుక్స్ అదిరిపోయాయి. మళ్లీ హీరోయిన్ గా రాణించడానికి కావాల్సినంత సత్తా తనలో ఉందని తన కాన్ఫిడెన్స్ చూస్తేనే అర్థమవుతుంది. కాజల్ చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ఆమెను సినిమాల్లో మిస్ అవుతున్న ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం కాజల్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎలాగు గౌతం ఓకే చెప్పాడు కనుక ఇక మీదట రెగ్యులర్ సినిమాలు చేయాలని చూస్తుంది కాజల్.

అయితే కమర్షియల్ సినిమాల కన్నా లేడీ ఓరియెంటెడ్ కథలకు ఆమె ప్రిఫర్ చేస్తుందని తెలుస్తుంది. సమంత బాటలోనే కాజల్ కూడా తనే సినిమా అంతా నడిపించాలని అనుకుంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.