Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: నాభి సుంద‌రి వెట్ లుక్

By:  Tupaki Desk   |   8 Jan 2020 6:48 AM GMT
ఫోటో టాక్‌: నాభి సుంద‌రి వెట్ లుక్
X
బాలీవుడ్ లో రెండు ద‌శాబ్ధాల కెరీర్ కి చేరువ అవుతోంది క‌త్రిన‌. ఇప్ప‌టికీ ఏమాత్రం క్రేజు త‌గ్గ‌ని నాయిక‌గా వెలిగిపోతోంది. స‌ల్మాన్ భాయ్ వరుస‌గా అవ‌కాశాలిస్తూ క‌త్రిన రేంజ్ ఏమాత్రం త‌గ్గ‌కుండా చూస్తున్నాడు. న‌వ‌త‌రం నాయిక‌లు ఎందురు బ‌రిలో దిగినా క‌త్రినకు క్రేజు అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు.

ఇక 35 ఏజ్ లోనూ క‌త్రిన గ్లామ‌ర్ కించిత్ కూడా త‌గ్గ‌క‌ పోవ‌డం ఈ క్రేజుకు నిద‌ర్శ‌నం. ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ ని మెయింటెయిన్ చేస్తూ... కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నియ్య‌ని గ‌మ్మ‌త్తు త‌న‌కు ఉంద‌ని ప్రూవ్ చేస్తోంది. ఇటీవ‌లే రిలీజైన టైగ‌ర్ జిందా హై.. భారత్ చిత్రాల్లోనూ విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలోనూ క‌త్రిన స్పీడ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

తాజాగా క్యాట్ వెట్ లుక్ ఒక‌టి అంత‌ర్జాలాన్ని వేడెక్కిస్తోంది. నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ ని క‌త్రిన రివీల్ చేసింది. ఇక టాప్ టు బాట‌మ్ బ్లాక్ స్పోర్ట్స్ వేర్ తో ర‌ఫ్ఫాడించింద‌నే చెప్పాలి. వెట్ జెల్ తో హెయిర్ స్టైల్ ని స్పైస‌ప్ చేసింది. తీక్ష‌ణమైన చూపుల‌తో క‌త్రిన సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. 2020లో క‌త్రిన సూర్య‌వ‌న్షీ అనే చిత్రంలో మాత్ర‌మే న‌టిస్తోంది. ఇత‌ర ప్రాజెక్టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.