Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మెగా టీమ్ ఓ చోట చేరితే మ‌్యాడ్ ఫ‌న్

By:  Tupaki Desk   |   14 March 2021 3:50 AM GMT
ఫోటో స్టోరి: మెగా టీమ్ ఓ చోట చేరితే మ‌్యాడ్ ఫ‌న్
X
మెగా గ్యాంగ్ ఓచోట చేరితే ర‌చ్చ ర‌చ్చే.. అందుకు ఈ ఫోటోనే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ .. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్.. సుశ్మిత .. శ్రీ‌జ‌.. వీళ్ల‌తో పాటే మెగా మేన‌ల్లుళ్లు సాయిధ‌ర‌మ్ తేజ్- వైష్ణ‌వ్ తేజ్ అంతా ఓ చోట చేరి హాయిగా ఫ‌న్ ని ఆస్వాధిస్తున్నారు.

తోబుట్టువులు అంతా ఓ చోట చేరితో ఆ సెల‌బ్రేష‌నే వేర‌ని ప్రూవ్ అయ్యింది. కజిన్స్ మ‌ధ్య చ‌క్క‌ని స‌త్సంబంధాలు అనుబంధాలు ఉంటే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ వెలుగులు మెగా క‌జిన్స్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నా.. వీకెండ్స్ ఓచోట క‌లుసుకోవ‌డం అనే స‌త్సాంప్ర‌దాయం క‌నిపించ‌డం మెగా ఫ్యామిలీ ప్ర‌త్యేక‌త‌.

పండ‌గ‌లు ప‌బ్బాల వేళ కూడా మెగా ఫ్యామిలీ అంతా ఓ చోట చేరి సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌డం చూస్తున్న‌దే. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో అంతా ఓ చోట సంద‌డిగా కోలాహాలంగా పండ‌గ‌ల్ని ఆస్వాధించే సంస్కృతి ఉంది. సంక్రాంతి-దీపావ‌ళి-ద‌స‌రా -క్రిస్మ‌స్ ప్ర‌తి పండ‌క్కి మెగా ఇంట ప్ర‌త్యేక‌మైన ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఆక‌ట్టుకుంటుంది. బెంగ‌ళూరు లోని మెగాస్టార్ ఫామ్ హౌస్ లో ప్ర‌తి సంక్రాంతికి మెగా-అల్లు ఫ్యామిలీస్ సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌డం చూస్తున్న‌దే.